Sarileru Neekevvaru Teaser: Mahesh Babu packs a punch as an army commando in this pakka action entertainer (Photo-Twitter)

Hyderabad, November 22: సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు 9Sarileru Neekevvaru)’. రష్మికా మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి (Vijayashanthi) నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ఈ రోజు విడుదలయింది. విడుదలయిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయి భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది.

ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతి మొగుడు వచ్చాడు’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరూ’ టీజర్‌తో సూపర్ స్టార్ మహేష్ బాబు (Super star Mahesh Babu) దుమ్మురేపుతున్నాడు. ‘మీరు ఎవరో మాకు తెలియదు.. మీకు మాకు ఏ రక్త సంబంధం లేదు.. కాని మీ కోసం మీ పిల్లల కోసం ఎండ వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం ఎందుకంటే మీరు మా బాధ్యత’ అంటూ మహేష్ బాబు డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌లో పంచ్‌ డైలాగులు దుమ్మురేపుతున్నాయి.

Sarileru Neekevvaru TEASER

అనీల్ రావిపూడి కలానికి మహేష్ డైలాగ్ డెలివరీ తోడు కావడంతో టీజర్ అదిరిపోయింది. ‘మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలురా.. మిమ్మల్ని ఎలా చంపుకుంటానురా.. మీ కోసం ప్రాణాలను ఇస్తున్నాం రా అక్కడ. మీరేమో కత్తులు గొడ్డలు వేసుకుని ఆడాళ్ల మీద. బాధ్యత ఉండక్కర్లా’ అంటూ టీజర్లో మహేష్ చెప్తున్న డైలాగ్ హార్ట్ టచ్ చేస్తోంది.

‘భయ పడే వాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాల్లేవమ్మా’ అని మహేష్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌కు విజిల్స్ వేయించేదిగా ఉంది. ‘గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్’ అంటూ విజయశాంతి సైతం డైలాగ్‌తో అదరగొట్టేసింది.

మహేశ్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్, F2 లాంటి వరుస బ్లాక్ బస్టర్ అందుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సరిలేరు నీకెవ్వరు.