Hyderabad, April 29: సమంత (Samantha) ప్రధాన పాత్రను పోషించిన 'శాకుంతలం' (Sakunthalam) సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై చివరకు నిరాశనే మిగిల్చింది. బాక్సాఫీస్ (Boxoffice) వద్ద కాసులను కురిపిస్తుందనుకున్న ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫ్లాప్ కావడంపై దిల్ రాజు స్పందిస్తూ... తన పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం అని అన్నారు. సోమవారం, మంగళవారానికే కలెక్షన్లు లేవంటే ఫలితం ఏమిటో తమకు అర్థమైపోయిందని చెప్పారు. ఇంకా కలెక్షన్లు వస్తాయేమో అనే భ్రమల్లో ఉండటం వేస్ట్ అన్నారు. ఇక సమంత స్పందిస్తూ... నటించడం వరకే తన పని అని, ఫలితం తన చేతిలో లేదని చెప్పింది.
Dil Raju: శాకుంతలం మిస్ ఫైర్ అయింది.. నా పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం..
https://t.co/NEkimIYAOU#DilRaju #Shaakuntalam #Samantha #ShaakuntalamFailure #MovieNews
— hmtv News (@hmtvnewslive) April 28, 2023
పెట్టుబడిలో సగం కూడా..
ఈ సినిమాకు దిల్ రాజుతో పాటు దర్శకుడు గుణశేఖర్ కూడా పెట్టుబడులు పెట్టారు. సమంత అందం, అభినయం, గుణశేఖర్ దర్శకత్వ ప్రతిభపై నమ్మకంతో దిల్ రాజు భారీగా పెట్టుబడులు పెట్టారు. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాలేదని తెలుస్తోంది.