Hyderabad, April 29: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan), రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో 'ఎత్తర జెండా' పాటలో సైడ్ డ్యాన్సర్ గా చేసిన మణికంఠన్ ను బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే బంజారా హిల్స్ రాఘవ రెసిడెన్సీలో మరో నలుగురు డ్యాన్సర్లతో కలిసి మణికంఠన్ మందు తాగి గొడవ చేస్తుండగా వాచ్ మెన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో, కోపం తట్టుకోలేకపోయిన మణికంఠన్ వాచ్ మెన్ తో గొడవపడ్డాడు. అతడిని మూడవ అంతస్తు నుంచి తోసేశాడు. ప్రస్తుతం వాచ్ మెన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మణికంఠన్ ను అరెస్ట్ చేశారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన మణికంఠన్ ప్రస్తుతం టాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు.

Jiah Khan Suicide Case Verdict: జియా ఖాన్ ఆత్మహత్య కేసులో సూరజ్ పంచోలికి ఊరట, హీరోయిన్‌పై బెదిరింపులకు పాల్పడలేదని నిర్థారించిన సీబీఐ కోర్టు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)