Ahmadabad, May 22: బాలీవుడ్ నటుడు, కోల్‌కతా ఐపీఎల్ జట్టు సహ యజమాని షారుక్ ఖాన్ (Shah Rukh Khan) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కోల్‌కతా (KKR), సన్ రైజర్స్ (SRH) హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌కు వచ్చిన ఆయనకు ఎండ వేడిమి వల్ల వడదెబ్బ తగిలినట్లు (Sun Stroke) తెలుస్తోంది. ఆస్పత్రిలో చేరిన తర్వాత వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జి చేశారు. అనంతరం విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.
#WATCH - Gauri Khan reaches KD Hospital in Ahmedabad. Actor Shah Rukh Khan is admitted apparently due to heat stroke.#GauriKhan #ShahRukhKhan pic.twitter.com/Ofr1lqEHEX
— TIMES NOW (@TimesNow) May 22, 2024
షారుక్ అనారోగ్యంతో ఆసుపత్రిలో (Shah Rukh Khan Hospitalised) చేరారంటూ వచ్చిన వార్తలపై ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ‘కింగ్ ఖాన్‌కు ఏమైంది?’ ‘ఆయన త్వరగా కోలుకోవాలి’ అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు నిన్న జరిగిన మ్యాచ్‌లో విజయంతో కోల్‌కతా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ విజయాన్ని పిల్లలు సుహానా, అబ్‌రామ్‌తో కలిసి షారుక్ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకొచ్చాయి.