సింగర్ శ్రావణ భార్గవి ఈ మధ్య విడుదల చేసిన Okapari Kokapari song వివాదంగా మారిన సంగతి విదితమే. దీనిపై సింగర్ శ్రావణ భార్గవి స్పందించారు. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పుందని (Okapari Song Controversy Row) ఘాటుగా బదులిచ్చింది. 'ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడ కనిపించింది? నేను (Singer Sravana Bhargavi) ఆ పాటను ఎంత భక్తితో పాడానో నాకు తెలుసు. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్పా ఇంకేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం. నా ప్రాబ్లం కాదు.మీరు చూసే చూపులో లోపం ఉంటే దుప్పటి కప్పుకుని కూర్చున్నా అశ్లీలంగా కనిపిస్తుంది. సినిమా కటౌట్ కాదు, డ్రాయర్ యాడ్‌లా ఉంది! విజయ్ లేటెస్ట్ మూవీ కటౌట్ పై నెటిజన్ల ట్రోల్స్, లైగర్ ట్రైలర్ లాంచ్ కోసం 75 అడుగుల భారీ కటౌట్
నేనేం లిరిక్స్ మార్చి పాడలేదు. నా అంతరాత్మకి తెలుసు నేను తప్పుచేయలేదని. నిజంగా ఈ పాట తప్పు అంటే.. దేవుడే ఆ పాటని తీయించేస్తాడు. మగ గాయకులు ఆల్బమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఎలాంటి వివాదాలు ఉండవు. కానీ అదే ఆడవాళ్లు రిలీజ్ చేసినప్పుడే ఇలాంటి వివాదాలు సృష్టిస్తారు. అంటూ శ్రావణ భార్గవి కౌంటర్ ఇచ్చింది.
అయితే అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులు మండిపడుతున్నారు. వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాటను చిత్రీకరించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.