Sonu Sood (photo credit: Instagram)

కరోనా లాక్‌డౌన్ కాలంలో వేలాది మందికి ఆసరాగా నిలిచి ఆపద్బాంధవుడిగా మారిన సినీ నటుడు సోనూసూద్... చివరకు ఆ మమ్మారి బారిన పడ్డారు. సోనూకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సోనూ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ అనే విషయం ఈ ఉదయం నిర్ధారణ అయిందని చెప్పారు.

సురక్షిత చర్యల్లో భాగంగా ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్నానని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు. తన గురించి ఆందోళన చెందవద్దని... మీ సమస్యలను పరిష్కరించేందుకు తనకు కొంత సమయం లభించిందని చెప్పారు. మీకోసం నేనున్నాననే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు.

సోను అభిమానులు ఆయనకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. "త్వరలోనే మీరు మాములుగా తిరిగి వస్తారు సోనుసూద్, సర్ నిజంగా మానవత్వం ఇంకా సజీవంగా ఉందని చూపించే ఏదో ఒకటి చేస్తున్నారు, ఇప్పటికే చాలా ప్రార్థనలు మీతో ఉన్నాయి. మీరు ఆరోగ్యంగా తిరిగి వస్తారంటూ ట్విట్స్ చేస్తున్నారు.

Here's Sonu sood Tweet

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

కాగా సోనును ఇటీవల పంజాబ్ యొక్క యాంటీ-కరోనావైరస్ టీకా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. "నా సొంత రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడటానికి పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ ప్రచారంలో ఏమైనా పాత్ర పోషించడం నాకు చాలా ఆనందంగా ఉంది" అని ఆయన ఈ సంధర్భంగా తెలిపారు.

"నేను రక్షకుడిని కానని నేను నిజంగా నమ్ముతున్నాను. నేను దేవుని పెద్ద ప్రణాళికలలో నా స్వంత చిన్న పాత్ర పోషిస్తున్న మానవుడిని. ఈ ప్రక్రియలో, ఏదైనా జీవితాలను ఏ విధంగానైనా తాకగలిగితే, అది దేవుడు ఆశీర్వదించాడు నా కర్తవ్యాన్ని నెరవేర్చడానికి అతను నాకు మార్గనిర్దేశం చేస్తున్నాడు "అని చెప్పగలను అంటూ మహమ్మారి సమయంలో సూద్ తన పని గురించి మరొక ప్రకటనలో చెప్పాడు.