
భారతీయ సినీ పరిశ్రమలో అతిపెద్ద పురస్కారంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు (Dadasaheb Phalke Award) సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకున్నారు. ఈ అవార్డ్‌ను తన గురువు, స్నేహితులు, అభిమానులు, తమిళ ప్రజలు, తన సినీ కుటుంబానికి అంకితం ఇస్తున్నట్లుగా తెలిపారు. ఈ విషయం తెలుపుతూ ఆయన (South indian Superstar Rajinikanth) అధికారికంగా ఓ లేఖను విడుదల చేశారు. భారత సినీ పితామహుడుగా పేరుగాంచిన దాదా సాహెబ్ ఫాల్కే పేరు మీద ప్రతి యేటా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తోన్న విషయం తెలిసిందే.
కోలీవుడ్‌లో నడిగర్ తిలగం శివాజీ గణేశన్, దర్శక దిగ్గజం కె.బాలచందర్ వంటి వారిని ఈ పురస్కారం వరించింది. ఈ క్రమంలో గత 2019 సంవత్సరానికిగాను ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రకటించింది. అయితే, కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణ ఆంక్షల నేపథ్యంలో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం నేడు (అక్టోబర్ 25) ఢిల్లీలో జరిగింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రజనీకాంత్ ఈ అవార్డును అందుకున్నారు.
హూట్ యాప్ ప్రారంభించిన రజినీకాంత్, భారతదేశం నుండి ప్రపంచం కోసం అంటూ ట్వీట్ చేసిన సూపర్ స్టార్
భారత ప్రభుత్వం నాకిచ్చిన ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును నన్ను నటుడిగా గుర్తించి, తీర్చిదిద్దిన నా గురువు శ్రీ కె. బాలచందర్‌గారికి, నా పెద్దన్నయ్య శ్రీ సత్యన్నారాయణరావు గైక్వాడ్‌కు, నా స్నేహితుడు శ్రీ రాజ్ బహదూర్‌కు.. నా సినీ కుటుంబానికి చెందిన నిర్మాతలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు, సహ నటీనటులకు, పంపిణీదారులకు, థియేటర్ల యజమానులకు.. మీడియా మిత్రులకు.. నన్ను ఎంతగానో ఆరాధించే నా అభిమానులకు మరియు నాకు దైవ సమానులైన తమిళ ప్రజలకు అంకితం ఇస్తున్నాను..’’ అని రజనీకాంత్ ఈ లేఖలో తెలిపారు.
Here's Rajinikanth Tweets
🙏I dedicate my award to… https://t.co/XxOaI82k4C
— Rajinikanth (@rajinikanth) October 25, 2021
— Rajinikanth (@rajinikanth) October 25, 2021
ఇదే అవార్డుల ప్రధానోత్సవంలో హీరో ధనుష్ అసురన్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. దీంతో ఒకే ఏడాదిలో రజనీకాంత్, ఆయన అల్లుడు ధనుష్ అవార్డులు అందుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.