Credits: Instagram

Hyderabad, Jan 6: సినీ పరిశ్రమలో (Movie Industry) మరో తీవ్ర విషాదం నెలకొంది. దక్షిణ భారత సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ (Art Director), ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన సునీల్ బాబు (50) (Sunil Babu) కన్నుమూశారు. గుండెపోటుతో ఎర్నాకులంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది.  కేరళలోని పాతనంతిట్టలోని మల్లాపల్లికి చెందిన సునీల్ మలయాళం, తమిళం, తెలుగు, బాలీవుడ్ చిత్రాల్లో ఆర్ట్ డైరెక్టర్‌గా బిజీగా ఉన్నారు.

గుడిపై కుప్పకూలిన విమానం.. పైలెట్ మృతి.. మరొకరికి గాయాలు.. మధ్యప్రదేశ్ లో ఘటన

విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వారిసు’ సినిమాకు సునీల్ బాబు చివరిగా పని చేశారు. వివిధ భాషల్లో 100 సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన సునీల్ బాబు గత ఏడాది సూపర్ హిట్ అందుకున్న సీతారామం సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. 50 కి పైగా అవార్డులు అందుకున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Anjali Menon (@anjalimenonfilms)