 
                                                                 Hyderabad November 07: సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పుష్ప మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటి వరకు కమెడియన్, హీరో, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన సునిల్, పుష్పతో విలన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన లుక్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో సునీల్ మంగళం శ్రీను అనే పాత్రలో కనిపించనున్నట్లు ఫస్ట్ లుక్‌తో క్లారిటీ వచ్చింది. ఇందులో సునీల్ బట్టతలతో, భయంకరమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తూ కనిపించాడు. సునీల్ లుక్ చూసి అంతా స్టన్ అవుతున్నారు.
తొలి పార్ట్ లో సునీల్ విలన్‌గా కనిపించనుండగా, ఈ పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మూవీ ప్యాన్ ఇండియా లెవల్‌లో రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది.
Presenting the face of evil 😈
Introducing @Mee_Sunil as #MangalamSrinu from #PushpaTheRise 🔥#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/9XtnGSOjwF
— Mythri Movie Makers (@MythriOfficial) November 7, 2021
చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే.. ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి సాంగులు విడుదలై… యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండగా… రీసెంట్‌గావిడుదలైన మూడో సింగిల్ ” సామి సామి ” కూడా రచ్చరచ్చ చేసింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
