New Delhi, July 22:  2020 ఏడాదికి జాతీయ అవార్డుల (68th National Film Awards)ను ప్రక‌టించింది. కేంద్రం 66వ జాతీయ సినిమా అవార్డుల‌ను ప్రక‌టించింది. కేంద్రం 15 ప్రాంతీయ భాషా చిత్రాల‌కు జాతీయ అవార్డులను ప్రక‌టించింది. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో(National Film Awards) తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫోటో(color photo) ఎంపికైంది. ఇక ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో నాట్యం (Natyam)మూవీకి అవార్డులు దక్కాయి. అంతేకాదు బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ గా అలవైకుంఠపురములో (Ala vaikuntapuram lo) మూవీకిగానూ థమన్ కు (S.S Taman) అవార్డు లభించింది. ఇక ఓవరాల్ గా అవార్డుల్లో తమిళ్ మూవీ సురారై పోట్రు కు (Soorarai Pottru) అవార్డుల పంట పండింది. ఆ సినిమాకు ఏకంగా ఐదు జాతీయ అవార్డులు దక్కాయి. బెస్ట్ మూవీతో పాటూ, ఉత్తమ నటుడు, నటి, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అవార్డులను దక్కించుకుంది సురారై పోట్రు మూవీ. సూర్య (Surya) నటించిన ఈ సినిమా తెలుగులో ఆకాశమే హద్దురా పేరుతో డబ్బింగ్ అయింది.

Actress Samantha: అతను భర్త కాదు, మాజీ భర్త అనండి, రూ.250 కోట్లు తీసుకున్నా అనేది రూమర్స్, ఇద్దరినీ ఒకే రూంలో ఉంటే పొడుచుకుంటాం, కాఫీ వీత్‌ కరణ్‌ జోహార్‌ షోలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు 

ఇక జాతీయ ఉత్తమ నటుడి కేటగిరీలో ఇద్దరు ఎంపికయ్యారు. సూరారైపోట్రులో నటనకు గానూ సూర్య(Surya), తానాజీలో నటనకు అజయ్‌ దేవగణ్‌లు (Ajay devagan) ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళిని(Aprna balamurlai) అవార్డు వరించింది. ఇక మొత్తం 30 భాషల్లో 305 ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఎంట్రీకి వచ్చాయి.

Rakhi Sawant: ముద్దు సీన్లు, అత్యాచారం సీన్లకే పనికివస్తానా అంటున్న బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌, మంచి అవకాశాలు ఇచ్చి చూడాలని బాలీవుడ్ దర్శకులకు విజ్ఞప్తి 

అలాగే నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ కేటగిరీలో 148 చిత్రాలు స్క్రీనింగ్‌ వచ్చినట్లు జ్యూరీ మెంబర్స్‌ తెలిపారు. ఈ ఏడాది అవార్డులను ఐదు కేటగిరీలుగా విభజించారు. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును మరోసారి ప్రకటించనున్నట్లు జ్యూరీ మెంబర్స్ తెలిపారు.

జాతీయ అవార్డులు దక్కించుకున్న వారు వీరే!

తెలుగు..

జాతీయ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్-ఎస్ థ‌మ‌న్ (అల వైకుంఠ‌పురంలో)

ఉత్తమ కొరియోగ్రఫీ-సంధ్యారాజు (నాట్యం)

బెస్ట్ మేక‌ప్ -టీవీ రాంబాబు (నాట్యం)

త‌మిళం..

బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్‌-సూరారై పోట్రు

జాతీయ ఉత్తమ న‌టుడుగా సూర్య (సూరారై పోట్రు),

జాతీయ ఉత్తమ న‌టిగా అప‌ర్ణ బాల‌ముర‌ళి (సూరారై పోట్రు)

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌-జీవీ ప్రకాశ్ కుమార్ (సూరారై పోట్రు)

హిందీ..

జాతీయ ఉత్తమ న‌టుడుగాఅజ‌య్ దేవ్‌గ‌ణ్ (తానాజీ)

జాతీయ ఉత్తమ సంగీత ద‌ర్శకుడిగా విశాల్ భ‌ర‌ద్వాజ్ (1232 KMS డాక్యుమెంట‌రీ ఫిల్మ్‌)

మ‌ల‌యాళం

ఉత్తమ స‌హాయ న‌టుడు-బిజూ మీన‌న్ (అయ్యప్పనుమ్ కొషియుమ్‌)

బెస్ట్ ఫీ మేల్ ప్లేబ్యాక్ సింగ‌ర్-నాంచ‌మ్మ (అయ్యప్పనుమ్ కొషియుమ్‌)

బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ-(అయ్యప్పనుమ్ కొషియుమ్‌)

ఉత్తమ నాన్ ఫీచ‌ర్ ఫిల్మ్‌గా కుంకుం అర్చన్‌. బెస్ట్ బుక్ ఆన్ సినిమా ది లాంగెస్ట్ కిస్ నిలిచాయి. ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్స్ గా ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, మ‌ధ్యప్రదేశ్‌ నిలిచాయి. ఈ సారి బెస్ట్ క్రిటిక్ అవార్డు ఎవ‌రికీ లేద‌ని కేంద్రం ప్రక‌టించింది.