Chennai, OCT 16: నయనతార- విఘ్నేష్ శివన్ (Nayanatara vignesh Shivan) దంపతుల సరోగసీ వివాదం (Surrogacy row) సరికొత్త మలుపు తిరిగింది. పెళ్లైన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా పిల్లల్ని కనడంపై సెలబ్రెటీ కపుల్స్ ఇచ్చిన వివరణ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. వారిద్దరూ కవలలకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయ్యినట్లు ప్రకటించారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుని 4 నెలలు మాత్రమే కావడంతో.. ఈ జంట అద్దె గర్భం ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయ్యారంటూ వార్తలు వినిపించాయి. భారతదేశంలో సరోగసి (Surrogacy) ద్వారా పిల్లలకు తల్లిదండ్రులు అవ్వడం చట్టరీత్యా నేరం. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం.. “పిల్లలు ఎలా పుట్టారో వివరాలు సమర్పించాలంటూ” ఇటీవల నయనతార దంపతులను వివరణ కోరింది. ఈ మేరకు ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా, ఆ కమిటీ ఆ అఫిడివిట్ ని (Affidavit) ప్రభుత్వానికి అందజేశారు.
ఈ కమిటీకి నయనతార ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం...విఘ్నేష్ తో ఆరేళ్ల క్రితమే వారిద్దిరి వివాహం రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. దీంతో చట్టం ప్రకారం ఐదేళ్లు దాటిన తర్వాత దగ్గరి బందువుల సాయంతో సరోగసీ ద్వారా పిల్లల్ని కనవచ్చు. ఇదే రూల్ ప్రకారం నయనతార (Nayanatara) దగ్గరి దంపతులకు చెందిన వారి ద్వారా ఈ దంపతులు కవలల్ని కన్నట్లు నయన్ వివరణ ఇచ్చింది.
అన్ని పద్దతులను పూర్తిగా పాటిస్తూనే తాము సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయినట్లు కమిటీకి వివరణ ఇచ్చారు. దీంతో వారి వివరణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది.