Maharashtra CM Devendra Fadnavis (Photo Credit- ANI)

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుపై (Sushant Singh Rajput Case) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిపై సీబీఐ మూడేళ్లుగా జరుపుతున్న దర్యాప్తు గురించి స్పందిస్తూ.. 'మొదట్లో ఈ కేసులో వాళ్లూవీళ్లు చెప్పిన సమాచారం మాత్రమే ఉంది. ఆ తర్వాత కొందరు తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. వారి వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని కోరాము. ప్రాథమిక సాక్ష్యాలను సేకరించాం. వాటి విశ్వసనీయతను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రస్తుతం ఈ కేసు గురించి ఇంతకంటే ఏం చెప్పలేను' అన్నారు.

తీవ్ర అనారోగ్యంతో ICUలో ప్రఖ్యాత సింగర్‌, బ్యాక్టీరియా వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు గురైన అమెరికన్ పాపులర్‌ సింగర్‌ మడోన్నా

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 2020 జూన్‌లో ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా (Sushant Singh Rajput Suicide Case) కనిపించారు. మొదట ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అంతా అనుకున్నారు. కానీ ఇందులో కుట్ర కోణం ఉందని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది.ఇక సుశాంత్‌ చనిపోవడానికి వారం రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్‌ దిశా సాలియన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.