Kamalakar Reddy Dies: తెలుగు సినీ నిర్మాత కమలాకర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి, కరోనా సోకిన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా విషాద ఘటన
Kamalakar Reddy, (Right) mangled Remains Of The Ambulance He Was Travelling In (Photo Credits: Twitter, News Minute)

టాలీవుడ్‌ విషాదకర ఘటన చోటు చేసుకుంది. నిర్మాత, పంపిణీదారుడు గుండాల కమలాకర్‌రెడ్డి (48) (Telugu Distributor Kamlakar Reddy Dies) బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (Kamlakar Reddy Father Nandagopal Reddy) సైతం అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, కమలాకర్‌రెడ్డి తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ప్రైవేటు దవాఖానకు అంబులెన్స్‌లో తరలిస్తుండగా బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ కొడుకులిద్దరూ అక్కడిక్కడే మరణించారు.

డ్రైవర్‌ గాయపడగా చికిత్స కోసం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కమలాకర్‌రెడ్డి కేఎఫ్‌సీ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సుషాంత్ సింఘ్ రాజ్‌పుట్ కేసు సీబీఐకి, కేసు విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాను కేఎఫ్‌సీ తెలుగులో విడుదల చేసింది. ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్‌గా, అర్జున్‌రెడ్డి, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలతో పాటు హిందీ, తమిళ డబ్బింగ్‌ సినిమాలకు కూడా డిస్ట్రిబుటర్‌గా వ్యవహరించారు.