Valmiki Release: వార్నింగ్‌ల మధ్య విడుదలకు సిద్ధమైన వాల్మీకి, వరుణ్ తేజ్ మాస్ విశ్వరూపం, చాలా రోజులు తర్వాత తెరపైకి నితిన్, ఆ పాటే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందా ?
Varun Tej Valmiki movie Release And pre-release business details ( Image- Facebook )

మెగాఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చి మూడు,నాలుగు హిట్స్‌తో హీరోగా కుదురుకున్న వరుణ్ తేజ్‌ మాస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైపోయాడు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ .. అధర్వ మురళి, మృణాళిని రవి ప్రధాన పాత్రలుగా, నితిన్, పూజా హెగ్డే అతిధి పాత్రలుగా నటించిన వాల్మీకి ( Valmiki)మూవీ రేపు విడుదల కాబోతోంది. మాస్ మసాలా సినిమాలు తీయడంలో పేరు గాంచిన హరీష్ శంకర్ దీనికి దర్శకుడు. తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండ' చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమా అన్నీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.

మొత్తం 2 గంటల 53 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాలో వరుణ్ తేజ్( Varun Tej ) లుక్ కి, పూజా హెగ్డే ( PUja Hegde ) గ్లామర్ కి ఇప్పటికే మంచి మార్కులు పడిపోయాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో చిత్రీకరించిన 'దేవత' సినిమాలోని పాటకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో డింపుల్ హయాతి మెరవనుంది. ఈ సినిమాలో గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ మేకోవర్ సినిమాపై ఇప్పటికే సూపర్‌బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే వరుణ్ తేజ్ చిత్ర ప్రమోషన్లను పెంచేసాడు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రోమోలు విడుదల చేస్తూ వాల్మీకి చిత్రానికి ఓపెనింగ్స్ మంచిగా రావడానికి తానేం చేయాలో అంతా చేసేశాడు. వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరో అనుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాలో అతను విలన్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ యాంగిల్ ఎక్కడా ప్రొజెక్ట్ చెయ్యట్లేదు.

14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అంచనాలకు తగ్గట్టుగానే ‘వాల్మీకి’ ప్రీ రిలీజ్ బిజినెస్ ( pre-release business) కూడా బాగానే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘వాల్మీకి’ థియేట్రికల్ హక్కులను సుమారు రూ.20 కోట్లకు విక్రయించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అయితే సుమారు రూ.25 కోట్ల బిజినెస్ జరిగింది. ప్రస్తుతం వరుణ్ తేజ్‌కు ఉన్న మార్కెట్‌ను బట్టి చూస్తే ఈ రూ.25 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే గనుకు దీనికి మూడింతలు రావడం కూడా ఖాయం.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నితిన్ ( NItin) కామియో పాత్రలో మెరవనున్నాడు. ఈ విషయాన్ని వరుణ్ ట్విట్టర్ లో తెలియజేసాడు. వాల్మీకిలో అదిరిపోయే కామియో పాత్రలో మెరిసినందుకు భీష్మ నితిన్ కు థాంక్స్ అని పోస్ట్ చేసాడు. దానికి నితిన్, వాల్మీకి చిత్రంలో నేను కూడా భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 20న గత్తర్ లేపాల అని ట్వీట్ చేసాడు.

కాగా ఈ సినిమా పేరు మీద ఇప్పటికే వివాదం నడుస్తోంది. ఈ చిత్ర టైటిల్ మార్చాలంటూ చాలా రోజులుగా రచ్చ జరుగుతూనే ఉంది. రామాయ‌ణాన్ని రాసిన వాల్మీకి పేరుని ఓ గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాకు ఎలా పెడ‌తారు.. అసలు ఆయన్ని ఓ గ్యాంగ్ స్టర్‌తో ఎలా పోలుస్తారంటూ బోయ సామాజిక వ‌ర్గం వాళ్ల నుంచి నుంచి అభ్యంత‌రాలు వస్తూనే ఉన్నాయి. దీనిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చినా కూడా వాళ్లు ఊరుకోవడం లేదు. బోయవాడు వాల్మీకిగా మారి రామాయణం రాసాడు కాబట్టి.. తన సినిమా కూడా అలాగే ఉంటుందని తన సినిమాకు వాల్మీకి టైటిల్ పెట్టానని హరీష్ శంకర్  ( Hairsh Shankar ) చెబుతున్నారు. బిజెపి నేత లక్ష్మణ్ (Bandaru Laxman)  కూడా వీరికి జత కలిసి టైటిల్ మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈయనతో పాటుగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ( Kanna Laxminarayana) కూడా జత కలిసారు. వాల్మీకి పేరుతో వస్తున్న సినిమా వలన కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయని, వెంటనే వాల్మీకి చిత్రం పేరు మార్చాలని డిమాండ్ చేశారు.

మైత్తానికి సినిమా అన్ని రకాల ఆటుపోట్లను తట్టుకుని విడుదలకు రెడీ అయింది. ప్రేక్షకులను ఎలా మెప్పించిందనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.