అలనాటి అందాల హిందీ తార వహీదా రెహమాన్‌ దాదాసాహెబ్‌ ఫాల్కే జీవిత సాఫ్యల అవార్డు'కు ఎంపికైంది. చిత్రపరిశ్రమకు అందించిన సేవలకుగానూ ఆమెకు ఈ సినీ అత్యున్నత పురస్కారం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోషల్‌ మీడియాలో నటి సేవలను కొనియాడారు.

హిందీ సినిమాల్లో అత్యధికంగా నటించిన వహీదా విమర్శలకు నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. వాటిలో ప్యాసా, కాగజ్‌ కే పూల్‌, చౌదావికా చంద్‌, సాహెబ్‌ బివి ఔర్‌ గులాం, గైడ్‌, కామోషి తదితర చెప్పుకోదగ్గ చిత్రాలున్నాయి అని అనురాగ్‌ ఠాకూర్‌ ట్వీట్‌ చేశారు.1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించిన వహీదా..రోజులు మారాయి సినిమాలో ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా పాటతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత ఎన్టీఆర్ తన సొంత సంస్థలో నిర్మించిన జయసింహాలో హీరోయిన్ గా నటించింది.

1971లో 'రేష్మా ఔర్‌ షేరా' చిత్రంతో వహీదా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచింది. 1972లో 'పద్మశ్రీ', 2011లో 'పద్మభూషణ్' అందుకుంది. దేవ్ ఆనంద్ తలపెట్టిన 1956 చిత్రం CID తో ఆమె హిందీ సినిమా రంగ ప్రవేశం జరిగింది. రెహ్మాన్ చివరిసారిగా స్కేటర్ గర్ల్ అనే 2021లో రాబోయే స్పోర్ట్స్ డ్రామాలో కనిపించింది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)