ANR National Awards 2018 - 2019: ఘనంగా ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవం, దివంగత నటి శ్రీదేవి మరియు సీనియర్ నటి రేఖలకు పురస్కారాలు, ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి
ANR National Awards 2018 - 2019 Event at Hyderabad | Photo Credits : Annapurna Studios

అక్కినేని ఇంటర్నేషన్ ఫౌండేషన్ ప్రతీ ఏడాది ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. 2018-19 సంవత్సరానికి గానూ ఉత్తమ నటులకు అవార్డులు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ( ANR National Awards 2018 - 2019) మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా, టి. సుబ్బిరామి రెడ్డి ప్రత్యేక అతిథిగా హజరయ్యారు.

2018 ఏడాదికి గాను, దివంగత నటి శ్రీదేవిని ఏఎన్నార్ జాతీయ పురస్కారంతో గౌరవించారు. ఆమె భర్త బోనీ కపూర్ ఈ అవార్డును స్వీకరించారు. ఇక 2019 గాను, సీనియర్ బాలీవుడ్ నటి రేఖకు ఈ అవార్డుతో సత్కరించారు. ఆమె స్వయంగా ఈ వేడుకకు హాజరై అవార్డును స్వీకరించారు.

ANR National Awards 2018 - 2019 LIVE:

ఈ వేడుకకు అక్కినేని ఫ్యామిలీతో పాటు, టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, అడవి శేష్, రాహుల్ రవీంద్రన్ అలాగే మంచు లక్ష్మీ, నిహారిక, తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవం సందర్భంగా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా (AISFM) నుండి ఉత్తమ ప్రతిభ కనబర్చిన, ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు అవార్డు, డిగ్రీ పట్టాలు ప్రముఖుల చేతుల మీదుగా అందజేస్తారు.