కంటెంట్ స్ట్రీమింగ్ సర్వీసెస్లో, క్వాలిటీ పెరిగే కొద్దీ స్ట్రీమింగ్ నాణ్యతను కోల్పోతుంది అని, కానీ ఆన్ లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ కోసం డబ్బు ఖర్చు చూస్తున్న అభిమానులకు హులు మరియు నెట్ఫ్లిక్ చాలా ఉత్తమ మైన సర్వీస్స్ అందిస్తున్నాయని "రీల్ గుడ్" స్ట్రీమింగ్ సర్వే సంస్థ వెల్లడించింది.
స్ట్రీమింగ్ సెర్చ్ ఇంజిన్ రిల్ గుడ్ సర్వే ప్రకారం... హులు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హెచ్‌బిఒ మరియు షోటైం మొదటి 5 స్థానాల్లో ఉన్నాయని, ఇవి చాలా క్వాలిటీ తో కూడిన కంటెంట్ ని నిర్మించడమే కాకుండా, క్వాలిటీ తో కూడిన స్ట్రీమింగ్ సర్వీసెస్ అందిస్తున్నాయని తెలిపింది. వాటిలోకెల్లా హులు, నెట్ ఫ్లిక్ చాలా మెరుగైన వని వెల్లడించింది.
ఫై సర్వే కి గాను రీల్‌గుడ్ IMDB లో , అధిక నాణ్యత గల వెబ్ సిరీస్‌ను, 8 కంటే ఎక్కువ రేటింగ్స్ వున్న కంటెంట్ ఆధారంగా నిర్వచించారని వెల్లడించారు.
అయితే ప్రైమ్ వీడియోలో టీవీ షోల కి అతిపెద్ద లైబ్రరీ ఉందని, నెట్‌ఫ్లిక్స్ యొక్క ఒరిజినల్ షోలు ఇటీవల ఎమ్మీ నామినేషన్స్ లో ఆధిపత్యం వహిస్తున్నాయని పేర్కొంది.