SS rajamoulis-funny-reply-to-ram-gopal-varmas-tweet (Photo-Wiki and-Facebook-and twitter)

November 2: కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్, వివాదాలకు మారు పేరుగా నిలిచిన రాంగోపాల్ వర్మ ఈ మధ్య కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో సంచలనంగా మారిన సంగతి అందిరకీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన విడుదల చేసిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ వివాదాలకు మరింతగా ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే వివాదంలోకి సినీ ప్రముఖులను లాగిన వర్మ తాజాగా రాజమౌళిని కూడా ఈ వివాదంలోకి లాగే ప్రయత్నం చేశాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని కేఏ పాల్‌ సాంగ్‌ను రిలీజ్ చేసిన వర్మ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

`కేఏ పాల్ బయోపిక్‌ను తెరకెక్కిస్తే ఇండియాలో జోకర్‌ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో దానికన్నా ఎక్కువగా ఇంకా చెప్పాలంటే బాహుబలి 3 కన్నా ఎక్కువగా ఘన విజయం సాధిస్తుంది. ఇప్పటికే రాజమౌళి వాషింగ్టన్‌ డీసీలో కేఏ పాల్‌తో చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం కేఏపాల్‌ స్వయంగా నాకు ఫోన్‌ చేసి చెప్పాడు` అంటూ ట్వీట్ చేశాడు.

వర్మ ట్వీట్ 

అయితే ఈ ట్వీట్‌కు రాజమౌళి `నన్ను ఇన్వాల్వ్ చేయకండి `రాజు`గారు` అంటూ రిప్లై ఇచ్చారు. వర్మ కూడా వెంటనే రాజమౌళి ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. `సర్‌ సర్‌ సర్‌ నేనేం చేయటం లేదు. కేఏ పాలే నాకు ఆ విషయం చెప్పాడు. మీరు పాల్‌తో కలిస ట్రంప్‌ టవర్‌లో కూర్చొని లంచ్‌ చేశారని, మీరు బాహుబలి 3 కోసం పాల్‌ను తీసుకున్నారని చెప్పాడు. కేఏ పాల్ మీద ఒట్టేసి చెపుతున్నా` అంటూ రిప్లై ఇచ్చాడు. ఇది సరదాగా సాగిందా లేక మరే కోణంలో సాగిందో తెలియదు కాని సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.

నన్ను ఇన్వాల్వ్ చేయకండి `రాజు`గారు`

ఇదిలా ఉంటే వర్మ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సంబంధించిన పాటను విడుదల చేశారు. ఈ పాటను సిరాశ్రీ రాశారు. ‘నేనే కేఏ పాల్.. సూపిస్తా కమాల్.. నేనంటే మిలిటరీకి హడల్.. దేవుడికైనా గుండె గుభేల్’ అంటూ ఫన్నీ లిరిక్స్‌‌తో ఈ పాటను కంపోజ్ చేశారు.ఎన్నికల సమయంలో కెఏ పాల్ చేసిన ఫన్నీ వీడియోలు, కామెంట్లు, సెలబ్రిటీలతో ఆయన దిగిన ఫొటోలను ఈ వీడియోలో చూపించారు.

మనదంతా ఇంటర్నేషనల్ థింకింగ్. చిన్న చిన్నవాళ్లైన జగన్, చంద్రబాబు, కేసీఆర్ పవన్ కళ్యాణ్ కాదు మోడీ మన టార్గెట్. 2024లో ఆ సీట్ మనదే. మన ప్రమాణ స్వీకారానికి ఒకరు ఇద్దరు కాదు 150 దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు తమ ఫ్యామిలీతో కలిసి వస్తారు’ అని పాల్ చెప్పిన మాటలను వీడియోలో చూపించారు.ఈ వీడియోను విడుదల చేసిన గంటలోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.

కాగా ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా జక్కన్న తెరకెక్కిస్తున్నాడు. పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామ రాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రల్లో కనిపించనున్నారు.