The Kashmir Files: ఆర్టికల్ 370 కథతో కొత్త సినిమా, కాశ్మీర్‌ ఫైల్స్‌ పేరుతో తెరమీదకు, వివేక్‌ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వలో తెలుగు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న కాశ్మీర్ వ్యాలీ మూవీ
The Kashmir Files: Vivek Agnihotri joins hands with Abhishek Agarwal to produce the film (Photo-Twitter)

October 26: మన తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవడమే కాకుండా మన దర్శక, నిర్మాతలు బాలీవుడ్‌లో సినిమాలు నిర్మించేందుకు కూడా ఈ మధ్య ఆసక్తి చూపిస్తున్నారు. అల్లు అరవింద్, దిల్ రాజు వంటి అగ్రనిర్మాతలు ఇప్పటికే తమ బాలీవుడ్‌లో సినిమాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా హిందీలో సినిమా నిర్మించనున్నారు.కాశ్మీర్‌ లోయ చరిత్రలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా 'కాశ్మీర్‌ ఫైల్స్‌ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ది తాష్కెంట్‌ ఫైల్స్‌’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వివేక్‌ రంజన్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై తెలుగు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించనున్నారు.

సినిమా మీద ట్వీట్ 

ఆర్టికల్‌ 370 చుట్టూ అల్లిన కథతో ఈ చారిత్రాత్మక సినిమా ఉంటుంది. ఆర్టికల్‌ 370 ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు రద్దు చేశారు? అనే కారణాలను మా చిత్రంలో చూపించబోతున్నాం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 14, 2020న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత అభిషేక్‌ వెల్లడించారు. ఈ చరిత్రలో భాగమైన ఎంతోమంది లెజెండ్స్‌ పాత్రల్లో ప్రముఖ నటులు నటిస్తారు. ఆ వివ రాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.