Big Boss 4: మొదలైన ట్రై యాంగిల్ లవ్ స్టోరీ! తొమ్మిది మందిని ఒకేసారి సెల్ఫ్ నామినేట్ చేసుకునేలా టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్, ఈసారి హౌజ్ నుంచి వెళ్లిపోయేదెవరు?
Big Boss 4 Telugu | Pic Credits : Star Maa

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్ల ఎంపిక సరిగ్గా లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నా, షో మెల్లిమెల్లిగా ఆసక్తికరంగా మారుతోంది. శని, ఆది వారాల్లో జరిగిన బిగ్ బాస్ ఆట, పాటలతో ఫుల్ జోష్ తో సాగింది. అందరూ ఊహించినట్లుగానే హౌజ్ మేట్స్ తో అగ్రెసివ్ గా ప్రవర్తించిన సూర్యకిరణ్ హౌజ్ నుండి తొలివారంలోనే ఎలిమినేట్ అయ్యాడు, అదే సమయంలో 'ఈరోజుల్లో' మూవీ ఫేమ్ కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.

ఇప్పటికీ, బిగ్ బాస్ షోలో గంగవ్వ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. తనదైన శైలిలో నేచురల్ గా తన పెర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ పోతుంది. గంగవ్వకు అసలు ఎలిమినేట్ అవుతానేమో అన్న భయం కానీ, గెలవాలనే పట్టుదల గానీ రెండూ లేవు. అందరికీ భిన్నంగా తానే ఈ హౌజ్ నుంచి తొందరగా వెళ్లిపోవాలని కోరుకుంటుంది. ఇదే విషయాన్ని ఆదివారం హోస్ట్ నాగార్జునతో కూడా చెప్పేసింది. అయితే నాగ్ మాత్రం అది తన చేతిలో లేదని, ప్రేక్షకులు అనుకునే వరకు బయటకు వెళ్లేది లేదని తేల్చిచెప్పేశాడు, మీకు హౌజ్ లో ఏ కష్టం రాకుండా జాగ్రత్తగా చూస్కుంటామని గంగవ్వకు హామి ఇచ్చారు.

ఇక సోమవారం నాటి ఎపిసోడ్ లో మోనాల్ - అఖిల్ మధ్య లవ్ స్టోరి మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్నట్లు చూసే ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం వ్యక్తం అయింది. మరోవైపు, అభిజీత్ కూడా మోనాల్ కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లుగా అనిపించింది. అయితే అఖిల్- మోనాల్ మధ్య సాగుతున్న స్టోరీ చూసి అభిజిత్ కొద్దిగా అసూయ పడుతున్నట్లుగా తెలుస్తోంది.  దీనిని బట్టి ఎపిసోడ్లు సాగే కొద్దీ ఈ ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరి రంజుగా సాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Watch Episode Promo Here

సోమవారం నాటి ఎపిసోడ్ లో కంటెస్టంట్లకి బిగ్ బాస్ 'పడవ ప్రయాణం' టాస్క్ ఇచ్చారు. ఎవరైతే పడవ నుంచి దిగిపోతారో వారు వారంతట వారే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నట్లు అని మెలిక పెట్టారు. మొత్తం 9 మంది దిగిపోవాల్సి ఉంటుందన్నారు. అయితే హౌజ్ కెప్టెన్ అయిన లాస్యకు ఈ టాస్క్ నుంచి మినహాయింపు నిచ్చారు.

ఇక ఈ టాస్క్ లో తాను రిస్క్ చేస్తానని చెప్పి నోయెల్ అందరికంటే ముందు దిగిపోయాడు, ఆ తర్వాత గంగవ్వ తనకు కూర్చోటానికి కంఫర్ట్ గా లేదని దిగిపోయింది. సూర్యకిరణ్ వెళ్లిపోవటంతో కొంత ఒంటరిగా ఫీల్ అవుతున్న అమ్మ రాజశేఖర్ కూడా పడవ దిగాడు, ఆ తర్వాత మోనాల్, కరాటే కళ్యాణి, దేత్తడి హారిక, సోహైల్, అభిజీత్ అలాగే కొత్తగా వచ్చిన కుమార్ సాయి కూడా దిగిపోయాడు. దీంతో ఈ తొమ్మిది మంది ఇప్పుడు నామినేషన్ లో ఉన్నారు. ఇందులో ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వారు, బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.

గత వారం అనవసరమైన అర్గ్యుమెంట్లతో ప్రేక్షకులను విసుగెత్తించిన కరాటే కళ్యాణి ఆదివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున క్లాస్ పీకాడు, దీంతో కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ కరాటే కళ్యాణి ఎప్పుడెప్పుడు నామినేషన్లోకి వస్తుందా? ఎప్పుడు వెళ్లిపోతుందా అనేదానిపై సోషల్ మీడియాలో చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి ఏం జరుగుతుందో, ఎవరు వెళ్లిపోతారో వచ్చేవారం చూడాలి.