Hyderabad, AUG 04: తెలుగు బుల్లితెర నటుడు అమర్‌దీప్‌ (amardeep chowdary) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి తేజస్వినిని పెళ్లాడబోతున్నాడు. తాజాగా అమర్‌దీప్‌ (amardeep chowdary), తేజస్వినిల (tejaswini gowda) నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా (Ariyana) హాజరైంది. పూలదండలు మార్చుకుని సంతోషంలో మునిగి తేలిపోతున్న అమర్‌- తేజస్వినిలతో ఫొటోలు దిగి వారికి శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను అరియానా సోషల్‌ మీడియా షేర్‌ చేసింది. ఇది చూసి సర్‌ప్రైజ్‌ అయిన ఫ్యాన్స్‌.. అదేంటి? అమర్‌, తేజు నిశ్చితార్థం చేసుకున్నారా? ఇదెప్పుడు జరిగిందని ప్రశ్నిస్తున్నారు. ఇక త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా అమర్‌ దీప్‌.. జానకి కలనగలేదులో హీరోగా నటిస్తుండగా తేజస్వి కేరాఫ్‌ అనసూయ సీరియల్‌ చేస్తోంది.

ప్రస్తుతం 'జానకి కలగనలేదు' (Janaki kalaganaledu) సీరియల్‌లో హీరోగా నటిస్తున్న అమర్‌దీప్ ఆ సీరియల్ హీరోయిన్‌తోనే ప్రేమలో ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ తేజస్విని నిశ్చితార్థం చేసుకోవడంతో అవన్నీ రూమర్సే అని తేలిపోయింది.

Dulquer Salmaan : దుల్కర్ కోసం అఖిల్ స్పెషల్ హలీమ్.. ప్రతీ రంజాన్ కు మిస్ అవకుండా..  

మా టీవీలోని సీరియల్స్‌తో నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు అమర్‌దీప్, తేజస్విని. వీరిద్దరు కలిసి ఏ సీరియల్‌లో నటించకపోయినా.. ఒకే ఛానెల్‌లో పనిచేస్తున్నందు వల్ల పలు సందర్భాల్లో వీరు ఈవెంట్స్‌లో కలిసి కనిపించారు. కానీ వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. అందుకే ఎంగేజ్‌మెంట్ ఫోటోలు చూసిన బుల్లితెర ప్రేక్షకులు షాకవుతున్నారు.