Big Boss 3 Winner: తెలుగు బిగ్ బాస్ 3 విజేత ఎవరు? సీజన్-3 టైటిల్ రేసులో పోటీపడుతున్న రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి. ఈ వారంతో తేలిపోనున్న విజేత
Big Boss 3 - Rahul Sipligunj- Sreemukhi | Photo Credits : Star Maa

బిగ్ బాస్ తెలుగు (Big Boss Telugu) క్లైమాక్స్‌కు చేరుకుంది. సీజన్ 3 (Big Boss Season 3) ఫైనల్ వీక్  అక్టోబర్ 29, 2019 మంగళవారం నుంచే ప్రారంభమైంది. ఈ సీజన్‌లో తొలి నుంచి బలమైన పోటీదారులుగా భావించిన 5గురు కంటెస్టంట్లు ఈ ఫైనల్ వీక్ లోనూ కొనసాగుతుండటంతో కంటెస్టంట్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది.

అయితే తాజాగా అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం టైటిల్ రేసులో రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) మరియు శ్రీముఖి (Sreemukhi) దూసుకుపోతున్నట్లు తెలుస్తుంది. వీరి తర్వాత స్థానంలో వరుణ్ సందేశ్ (Varun Sandesh)  కొనసాగుతున్నారు. ఇక అలీ రెజా మరియు బాబా భాస్కర్ ఓటింగ్‌లో పూర్తిగా వెనకబడిపోయారు. దీంతో వీళ్లు పోటీ నుంచి తప్పుకున్నట్లే అని అర్థమవుతుంది.

రాహుల్ - శ్రీముఖి మధ్య పోటాపోటీ

బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ గెలుచుకోవటంలో రాహుల్ సిప్లిగంజ్ స్పష్టంగా హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నారు. ఈ సీజన్లో అతనికి భారీగా అభిమానులు వచ్చి చేరుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారి నుంచి కూడా రాహుల్‌కు భారీగా ఓట్లు పోలవుతున్నట్లు తెలుస్తుంది. ఓటింగ్ 5వ రోజు నాటికి రాహుల్ 42% ఓట్ షేర్ సాధించారు. ఇక రాహుల్‌కు సమీప ప్రత్యర్థి అయిన శ్రీముఖి నుంచి అతడికి గట్టి పోటీ ఎదురవుతున్నట్లు తెలుస్తుంది.  రాహుల్ కంటే శ్రీముఖి 10% ఓట్ల తేడాతో వెనకబడి ఉంది. వీరిద్దరికి ఒకరినిమించి ఒకరికి ఓట్లు పోలవుతున్నాయి. దీంతో వీరిద్దరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ 3 టైటిల్ ఎగరేసుకుపోవడం ఖాయంగా అభిమానులు బలంగా చెప్తున్నారు.

ఇక టైటిల్ రేసులో మరో హాట్ ఫేవరెట్‌గా నిలిచిన వరుణ్ సందేశ్‌కు కూడా అభిమానుల నుంచి మంచి మద్ధతు లభిస్తున్నప్పటికీ టైటిల్ గెలుచుకునేందుకు అవసరమయ్యేంత ఓట్లు దక్కడం లేదు. 17% ఓట్లతో వరుణ్ సందేశ్ 3వ స్థానంలో ఉన్నారు. అయినప్పటికీ వరుణ్ సందేశ్ కూడా ఇప్పటికీ రేసులోనే ఉన్నారు, చివరి క్షణం వరకు ఏమైనా జరగవచ్చు.   కొంపలో కుంపటి పెట్టబోయేది ఎవరు?

మిగిలిన కంటెస్టంట్లు బాబా భాస్కర్ (Baba Bhaskar) మరియు అలీ రెజా (Ali Reza) విషయానికి వస్తే వీరికి ఓటింగ్ పర్సంటేజ్ భారీగా తగ్గిపోయింది. హౌజ్‌లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బాబా భాస్కర్ 10% ఓట్ షేర్ తో 4వ స్థానంలో కొనసాగుతున్నారు. చివరగా మరో స్ట్రాంగ్ కంటెస్టంట్ అలీ రెజా ఒకసారి హౌజ్ నుంచి ఆశ్చర్యకరంగా ఎలిమినేట్ అయిపోయి తిరిగి అంతే ఆశ్చర్యకరంగా మళ్ళీ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఫైనల్ రేసులో మాత్రం చివరి స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు అలీ రెజా కేవలం 7% ఓట్ షేర్ ను మాత్రమే సాధించారు. దీంతో వీరిద్దరూ టైటిల్ రేసు నుంచి తప్పుకున్నట్లేనని స్పష్టమవుతుంది.

 

బిగ్ బాస్ సీజన్ 3కి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 03తో సీజన్ 3 ముగుస్తుంది. ఈ సీజన్ కి టైటిల్ విన్నర్ ఎవరని మీరు భావిస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.