Bigg Boss 5 Telugu: సరయూ ఎలిమినేట్, వెక్కి వెక్కి ఏడ్చిన విశ్వ, వెళుతూ అందర్నీ ఏకి పారేసిన సరయూ, బిగ్ బాస్ సీజ‌న్ 5 ఈ వారం ఎపిసోడ్ సాగింది ఇలా..
Sarayu eliminated from Telugu Bigg Boss House (Photo-Starmaa)

బిగ్ బాస్ సీజ‌న్ 5 వారం పూర్తి చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ప్ర‌వేశించ‌గా, ఆదివారం ఊహించిన కంటెస్టెంట్‌నే ఎలిమినేట్ చేశారు. స‌ర‌యు ఎలిమినేట్ అవుతుంద‌ని చెప్పుకు రాగా, చివరకు ఆమే బిగ్ బాస్ హౌజ్ (Bigg Boss House) వీడింది. స‌ర‌యు హౌజ్‌కి గుడ్ బై (Sarayu eliminated) చెప్పాల్సి రావ‌డంతో విశ్వ‌, హ‌మీదాతో పాటు కొంద‌రు కంటెస్టెంట్స్ చాలా ఎమోష‌న్ అయ్యారు.స్టేజ్‌పైకి వ‌చ్చిన స‌ర‌యుని నాగార్జున గేమ్ ఆడించ‌గా, ఆ గేమ్‌లో భాగంగా హౌస్‌లో 5 బెస్ట్, 5 వ‌ర‌స్ట్ కంటెంట్స్ చెప్పాల‌ని అన్నాడు.

శ్వేత‌, మాన‌స్, ప్రియాంక‌, హ‌మీదా, విశ్వ బెస్ట్ అని సిరి, షణ్ముఖ్‌, లహరి, సన్నీ, కాజల్‌ను వ‌ర‌స్ట్‌గా ఎంచుకుంది. అయితే వ‌ర‌స్ట్ కంటెస్టెంట్స్‌లో సిరి, స‌న్నీ , ల‌హ‌రిపై తెగ మండి ప‌డింది. సిరి, షణ్ముఖ్‌ ఒక స్ట్రాటజీతో వచ్చారని, బయటే అంతా ఫిక్స్‌ చేసుకుని వచ్చారని అభిప్రాయపడింది. ఆ తర్వాత సన్నీ గురించి చెప్తూ.. గతంలో ఆయనతో ఓ సినిమా చేశాను, అక్కడ జరిగిన చిన్న సంఘటన ద‌గ్గ‌ర నుండి నా మీద కోపం పెంచుకున్నాడు. అందుకే నేను బ‌య‌ట‌కు వెళ్లేదాకా నిద్ర పోలేదు. దానికి స్పందించిన స‌న్నీఅలాంటింది ఏమి లేదు అని చెప్ప‌గా, తాను పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ ట్రైనర్ అని నాకు నీ మైండ్‌లో ఏముందో తెలుస‌ని చెప్పుకొచ్చింది.

ఇక ల‌హ‌రిని కూడా ఫుల్ క్లాస్ పీకింది.అంత ఈగో ఏంటి? ఆ టోన్‌ మార్చుకో, ఎదగడానికి మనుషులను తొక్కాల్సిన అవసరం లేదు .. ‘ఏమీ లేని అరిటాకు ఎగిరెగిరి పడుతుందట, అని చెప్పి ఫుల్ ఫైర్ అయింది. నువ్వు కోపంలో ఉన్నావులే నేను అర్ధం చేసుకుంటా అంటూ ల‌హ‌రి చెప్పుకొచ్చింది. ఇక కాజల్‌ను కూడా వరస్ట్‌ కంటెస్టెంట్స్‌ లిస్టులో చేర్చిన సరయూ ఆమెను బుర్ర పెట్టి ఆడమని సలహా ఇచ్చింది. ష‌ణ్ముఖ్‌ని ఒక‌రిని కాపాడ‌డం కోసం నీ ఆట ఆడ‌కు అని తెలిపింది. ఇక సండే కావ‌డంతో నాగార్జున ఫ‌న్ డే అంటూ ర్యాంప్ వాక్, ఒక‌రి మ‌న‌సులో ఒక‌రికి ఏముందో అనేది చెప్పించాడు. ఈ ఆట చాలా స‌ర‌దాగా సాగింది.

బిగ్‌బాస్‌ షోకు ఓ దండం, నాకు ఆ షో నచ్చదన్న లోబో, నేడు అదే హౌస్‌లో వెరైటీ మ్యాన్, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

బిగ్ బాస్ సీజ‌న్ 5 (Bigg Boss 5 Telugu) ఈ వారం ఎపిసోడ్ సాగింది ఇలా

సండే ఎపిసోడ్‌ కోసం అందంగా ముస్తాబైన ఇంటిసభ్యులు జంటలుగా విడిపోయి ర్యాంప్‌ వాక్‌ చేశారు. వీరికి జెస్సీ, నాగ్‌ మార్కులేశారు. అయితే ర్యాంప్‌ వాక్‌ను లోబో, ఉమాదేవి ఖూనీ చేసి నవ్వించారు. రవి, హమీదా.. జెస్సీ, యానీ మాస్టర్‌ల కుర్చీ గొడవను గుర్తు చేస్తూ కామెడీ చేశారు. శ్రీరామచంద్ర దొరికించే ఛాన్స్‌ అనుకుని సిరిని ఎత్తుకుని తిప్పాడు. మిగతావాళ్లందరూ కూడా తమతమ స్టైల్లో ర్యాంప్‌ వాక్‌ చేసి అలరించారు. అనంతరం నాగ్‌.. మానస్‌ సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు.

తర్వాత ఇంటిసభ్యులను 9 జంటలుగా విడగొట్టి 'నేను నీకు తెలుసా?' అనే టాస్క్‌ ఆడించాడు. ఇందులో మొదట సిరి.. జెస్సీని నువ్వెందుకంత ఓవర్‌ చేస్తావని అడిగితే.. అతడు మాత్రం ఎందుకింత త్వరగా ఎంగేజ్‌ అయ్యావని తిరిగి ప్రశ్నించాడు. దీంతో షాకైన సిరి నువ్వు వస్తావని తెలీక అని చిలిపిగా సమాధానమిచ్చింది. సిరి అసలు పేరేంటని నాగ్‌ ప్రశ్నించగా శిరీష హన్మంత్‌ అని సరైన సమాధానం చెప్పాడు జెస్సీ. తర్వాత ఉమాకు రౌడీ రంగమ్మ పాత్ర సూటవుతుందని సరయూ,. సరయూకు అర్జున్‌రెడ్డి క్యారెక్టర్‌ సూటవుతుందని ఉమాదేవి చెప్పింది.

షణ్ముఖ్‌, విశ్వ జోడీ వంతు రాగా నాగ్‌... షణ్ముఖ్‌ ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడతాడని ప్రశ్నించాడు. దీనికి విశ్వ దీప్తి సునయన పేరు చెప్పాడు. హౌస్‌మేట్స్‌లో ఎవరి గురించి? అని నొక్కి ప్రశ్నించడంతో వెంటనే సిరి అని టపీమని బదులిచ్చాడు. విశ్వ లోబోను ఎత్తుకోగలడా? అన్నదానికి అతడు ఏకంగా ఎత్తుకునే చూపించాడు. షణ్ముఖ్‌ చేయి మీద ఏమని టాటూ ఉంటుందని అడగ్గా విశ్వ.. D అనే అక్షరం ఉంటుందని కరెక్ట్‌ ఆన్సరిచ్చాడు.

ప్రియాంక క్రష్‌ ఎవరని మానస్‌ను అడగ్గా అతడు శ్రీరామచంద్ర పేరు చెప్పాడు. ప్రియాంకను చేసుకునేవాడికి ఎక్కుగా ఏం ఉండాలి? అన్నదానికి కేరింగ్‌ అని చెప్పాడు మానస్‌. ఇలా అన్ని జంటల మధ్య ఫిట్టింగ్‌ పెట్టే ప్రశ్నలడిగాడు. ఆ తర్వాత లోబో.. ఇంట్లో వాళ్లకు ముద్దుపేర్లు పెట్టాడు. రవికి.. మిల్క్‌బాయ్‌, శ్వేత.. టామ్‌ బాయ్‌, సన్నీ.. చాక్లెట్‌, మానస్‌.. హ్యాండసమ్‌గాయ్‌, ప్రియాంక సింగ్‌.. బ్యూటిఫుల్‌, యానీ మాస్టర్‌.. అమ్మ, కాజల్‌.. ఎలుక, సరయూ.. తొండ, నటరాజ్‌.. బావ, ప్రియ.. క్వీన్‌, విశ్వ.. చపాతీ, షణ్ముఖ్‌.. డార్లింగ్‌, హమీదా.. ఎరోప్లేన్‌, శ్రీరామచంద్ర.. మూడీగయ్‌, సిరి.. సీతాకోక చిలుక, జెస్సీ.. పిల్లి అని చెప్పాడు. లహరి, ఉమాదేవికి మాత్రం తాను నిక్‌నేమ్స్‌ పెట్టలేనని చేతులెత్తేశాడు. అనంతరం కాజల్‌ సేఫ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు.

తర్వాత నామినేషన్‌లో ఉన్న జెస్సీ, సరయూలకు చెరో సైకిల్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. వీరిలో ఎవరి సైకిల్‌కు లైట్‌ వెలుగుతుందో వారు సేఫ్‌ అయినట్లని చెప్తూ వారిని టెన్షన్‌ పెట్టించాడు. కొద్ది క్షణాల అనంతరం జెస్సీ సైకిల్‌ బల్బ్‌ వెలగడంతో అతడు సేఫ్‌ అని నాగ్‌ ప్రకటించాడు. సరయూ ఎలిమినేట్‌ అయిందని వెల్లడించాడు. ఇది తట్టుకోలేకపోయిన విశ్వ హౌస్‌ లోపలకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాడు. అటు హమీదాను ఆపడం కూడా ఎవరి తరమూ కాలేదు. ఇక సరయూ చివరిసారిగా విశ్వను పట్టుకుని గట్టిగా ఏడ్చేసి అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది.