బిగ్‌బాస్ నాలుగో సీజన్ ఆదివారం సాయంత్రం (Bigg Boss Telugu 4 Launched) ప్రారంభమైంది. కింగ్ నాగార్జున వరసగా రెండో సారి వ్యాఖ్యాతగా ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో.. కరోనా కాలంలో వస్తాడో రాడో అనుకున్న సమయంలో ‘మాస్కు కావాల్సింది ముఖానికి కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కాదు’ అంటూ స్మాల్ స్క్రీన్‌పైకి బిగ్‌బాస్ (Bigg Boss (Telugu season 4) వచ్చేశాడు. స్టార్ మాలో సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షోలో హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన సినిమాలలోని పాటలకే సందడిగా డ్యాన్సులు చేశాడు.
ఈసారి వేదికపై నాగ్ డ్యూయల్ రోల్ చేశారు. వృద్ధుడైన తండ్రిగా, కుమారుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ వినోదం అందించే ప్రయత్నం చేశారు. వృద్ధ నాగార్జున బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించి ఒక్కో ప్రదేశాన్ని ఆడియన్స్ కు పరిచేయం చేశారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో ఎప్పుడూ లేనంత రిచ్ గా కనిపిస్తోంది. గార్డెన్ నుంచి కిచెన్ వరకు ప్రతిదీ నవ్యత సంతరించుకుంది. డైనింగ్ టేబుల్, హాల్, బెడ్ రూములు, స్విమ్మింగ్ పూల్... ఇలా ప్రతి అంశం కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఇక ఈ సారి హౌజ్‌లోకి 16మంది వస్తున్నారని తాతగారు చెప్పకనే చెప్పారు. నాగార్జున నాన్నగారికి బిగ్‌బాస్ ధన్యవాదాలు తెలిపాడు.
కరోనావైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన బిగ్‌బాస్ ఎపిసోడ్
బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీరే
1. నోయల్:
13వ కంటెస్టెంట్‌గా సింగర్ నోయల్ వచ్చాడు. సింగర్‌తో పాటు యాంకర్, యాక్టర్‌గా కూడా అందరికీ సుపరిచితుడే. ది షేక్ గ్రూప్ పేరుతో ఒక తెలుగు బ్యాండ్‌ని కూడా నిర్వహిస్తున్నాడు.
2. కరాటే కల్యాణి:
12 వ కంటెస్టెంట్‌గా కరాటే కల్యాణి ఎంట్రీ ఇచ్చింది. కృష్ణ సినిమాలోని బా..బీ.. డైలాగ్‌తో ఆమె ఫేమస్ అయ్యారు. పేరులో మార్షల్ ఆర్ట్స్ ఉన్నా సిల్వర్‌స్క్రీన్ మీద మాత్రం నవ్వులను పూయిస్తూ ఉంటుంది
3.అమ్మ రాజశేఖర్
11వ కంటెస్టెంట్స్‌గా డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే ఈ సాంగ్ నాగార్జునకు డెడికేట్ చేస్తూన్నఅంటూ కింగ్ సినిమాలోని పాటకు స్టెప్పులేశాడు.
4. అరియానా గ్లోరీ
పదో కంటెస్టెంట్‌గా యాంకర్ అరియానా గ్లోరీ వచ్చింది. జెమిని కెవ్వు కామెడీ యాంకర్‌గా అరియానా ఫేమస్ అయ్యారు. ఐయామ్ బోల్ట్ అంటూ ఆమె ఎంట్రీ ఇచ్చారు. సోహైల్,అరియానా గ్లోరీలను బిగ్‌బాస్‌లోకి కాకుండా నేబర్ హౌజ్‌లోకి పంపారు.
5. సయ్యద్ సోహైల్
తొమ్మిదో కంటెస్టెంట్‌గా టీవీ నటుడు సయ్యద్ సోహైల్ వచ్చాడు.
6. దేత్తడి హారిక
ఎనిమిదో కంటెస్టెంట్స్‌గా యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ 3 టైమ్‌లో కూడా హారిక పేరు సోషల్ మీడియా లో వినిపించింది. కానీ తను అప్పుడు సెలక్ట్ కాలేదు. ఈ సీజన్‌కి మాత్రం బిగ్‌బాస్ టీమ్ ఫోకస్ హారిక పై పడింది.
7. దేవి నాగవల్లి
ప్రముఖ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్. ఇటు యాంకరింగ్‌లోనూ, అటు రిపోర్టింగ్‌లోనూ దిట్ట. ఆమె న్యూస్ ప్రజెంటేషన్‌తో పాటు.. వస్త్రధారణ, హెయిర్ స్టైయిల్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది.
8. మెహబూబ్ దిల్‌సే
ఆరో కంటెస్టెంట్స్‌గా టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్ మెహబూబా దిల్ సే ఎంట్రీ ఇచ్చారు.
9. సుజాత
ఐదో కంటెస్టెంట్స్‌గా యాంకర్ సుజాత వచ్చేసింది. రెండు తెలుగు న్యూస్ ఛానల్స్‌లో యాంకర్‌గా పనిచేసింది. తెలంగాణ యాసతో పాపులర్ అయిన న్యూస్ యాంకర్స్‌లో సూజత ఒకరు
10. అభిజిత్
బిగ్‌బాస్ నాలుగో కంటెస్టెంట్స్‌గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు లైఫ్ ఈజ్ బ్యూటీవుల్ హీరో అభిజిత్. ఈ చిత్రంతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అభిజిత్.. మిర్చీలాంటి కుర్రాడు సినిమాతోనూ అలరించాడు. ఆ తరువాత యుఎస్ వెళ్లాడు.
11. యాంకర్ లాస్య
వివాహం అయిన తర్వాత టీవీకి దూరమైయ్యారు. ఇప్పుడు బిగ్‌బాస్ 4తో మళ్లీ రిఎంట్రీ ఇవ్వబోతున్నారు
12. సూర్యకిరణ్
రెండో కంటెస్టెంట్‌గా డైరెక్టర్ సూర్యకిరణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన కోసం ఏవీ ఇచ్చారు. తెలుగులో తొలి చిత్రం సత్యంతోనే మంచి హిట్ అందుకున్నారు. హీరోయిన్ కళ్యాణిని వివాహం చేసుకున్నారు.
13. మోనల్ గజ్జర్
సుడిగాడు సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన గుజరాతీ భామ మోనల్ గజ్జర్. తెలుగు, తమిళ్, మళయాళం, గుజరాతీ భాషల్లో హీరోయిన్‌గా నటించింది.