Kirak RP On Jabardasth: కిర్రాక్ ఆర్పీకి పిచ్చి ముదిరింది, జబర్దస్త్ లేకుంటే ఆర్పీ బతుకు కేరాఫ్ కృష్ణానగర్ ప్లాట్ ఫామే, కిర్రాక్ ఆర్పీపై కెవ్వు కార్తీక్ ఫైర్..
( Photo-Twitter)

జబర్దస్త్ పై కిర్రాక్ ఆర్పీ చేస్తున్న విమర్శలపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. మల్లెమాల ప్రొడక్షన్ సంస్థ పైన, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిపైన కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తాజాగా సాధారణ కంటెస్టెంట్​ నుంచి టీమ్​ లీడర్​గా ఎదిగి.. కెరీర్​లో విజయవంతంగా ముందుకు సాగుతున్న కెవ్వు కార్తీక్ కూడా స్పందించారు.

తన తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు జబర్దస్త్ తన​ జీవితంలో కీలక పాత్ర పోషించిందని. జబర్దస్త్​లో కాకుండా వేరే రంగంలో ఉండి ఉంటే తన తల్లి కోసం అంత చేసుండేవాడిని కాదని, ఈ షో చేయటం వల్ల... అందరు గుర్తుపట్టటంతో పాటు తన తల్లికి మంచి వైద్యం అందిందని కార్తిక్ చెప్పాడు.

కేరాఫ్ అడ్రస్ లేని స్థాయి నుంచి ఈ రోజు ఎంతో మంది టాలివుడ్ పరిశ్రమలో ఆర్టిస్టులుగా ఎదిగారంటే దాని వెనుక మల్లెమాల, జబర్దస్త్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని కెవ్వు కార్తీక్ చెప్పారు.

Telangana Rains: ఎవ్వరూ బయటకి రావొద్దు, భారీ వర్షాలపై ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు 

2015 ఒక సాధారణ కంటెస్ట్​గా అడుగుపెట్టి, ధన్​రాజ్​ టీమ్​లో చేసి, ఆ తర్వాత తిరుపతి ప్రకాశ్​ టీమ్​లో ఆరో కంటెస్ట్​గా చేసి, 2016 నుంచి ముక్కు అవినాశ్​తో టీమ్​ లీడర్​గా అవకాశం అందుకొని, ఇప్పటి వరకు టీమ్​ లీడర్​గా కొనసాగుతున్నానని, అందుకు జబర్దస్త్​కు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నాడు.

జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన ఆర్టిస్టులైన చమ్మక్ చంద్ర, మహేష్, రచ్చ రవి, వేణు, ధనరాజ్ లాంటి వారు ఎప్పుడు మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ మీద, అలాగే నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయలేదు. కానీ కిర్రాక్ ఆర్పీ మాత్రం మల్లెమాల లాంటి దరిద్రమైన నీఛమైన ప్రొడక్షన్ కంపెనీ ప్రపంచంలో ఎక్కడా ఉండదని.. తనకి ఈటీవీ అన్నా.. జబర్దస్త్ అన్నా అస్సలు ఇష్టం ఉండదని తీవ్ర విమర్శలు చేశాడు.