
ఢీ షో కొరియోగ్రాఫర్ చావా చైతన్య(32) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్పీ వీడియో తీసుకున్నారు. అందులో ‘అమ్మా నాన్న.. చెల్లీ.. నన్ను క్షమించండి.. కొరియోగ్రాఫర్లూ.. మిమ్మల్ని హర్ట్ చేస్తున్నాను.. అప్పులు ఎక్కువయ్యాయి. చెల్లించలేక ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. సెల్ఫీ వీడియో ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించారు.
వారి కథనం మేరకు.. లింగసముద్రం మండలం ముత్తావారిపాలేనికి చెందిన లక్ష్మీరాజ్యం సుబ్బారావు దంపతుల కుమారుడు చావా చైతన్య. కొరియోగ్రాఫర్‌గా జీవనం సాగిస్తున్నారు. అమ్మా, నాన్న, చెల్లెలు వినీలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. పలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే రియాల్టీ షోలలో డాన్స్ ప్రోగ్రాములకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
స్త్రీలు తమ శరీరాలను దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పుకుంటే అంత మంచిది, సల్మాన్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా నగరంలోని కళాంజలి ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ నిర్వాహకులు ఈ నెల 29వ తేదీ నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి చైతన్యను ఆహ్వానించారు. నెల్లూరుకు చేరుకున్న ఆయన.. బారాషహీద్ దర్గా సమీపంలోని నెల్లూరు క్లబ్‌లో గది అద్దెకు తీసుకున్నారు. శనివారం పుర మందిరంలో కళాంజలి ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆదివారం సాయంత్రం తనకున్న అప్పులు తీర్చలేక చనిపోతున్నానని.. తల్లిదండ్రులు, చెల్లెలు, స్నేహితులకు క్షమాపణలు చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. దాన్ని స్నేహితులకు పంపి.. గదిలోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వీడియోను చూసిన స్నేహితులు వెంటనే నెల్లూరు పోలీసులకు సమాచారమిచ్చారు.
దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య, ఎస్సై విజయకుమార్ నెల్లూరు క్లబ్‌కు చేరుకుని తలుపులు తెరిచేందుకు యత్నించగా.. అవి తెరుచుకోలేదు. దాంతో కిటికీలో నుంచి పోలీసులు లోనికి ప్రవేశించారు. అప్పటికే చైతన్య మృతి చెందారు. దీంతో పోలీసులు ఆయన తల్లిదండ్రులు, నెల్లూరు గ్రామీణ మండలం ధనలక్ష్మీపురంలో ఉన్న మేనమామ మాల్యాద్రికి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని మరణోత్తర పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చైతన్య ఉన్నత విద్యావంతుడు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన చైతన్య డాన్స్‌పై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చి.. ఢీ షో ద్వారా పాపులర్ అయ్యారు. గత సీజన్‌లో ఢీ టైటిల్ కొద్దిలో మిస్ అయ్యింది.చైతన్య సెల్ఫీ వీడియో చెప్పిన దాన్ని బట్టి.. ఆర్ధిక ఇబ్బందులే చైతన్య మాస్టర్ ఆత్మహత్యకి కారణం అని చాలామంది అనుకున్నారు. అయితే చైతన్య డబ్బు కోసం ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదని.. అతను అడిగితే డబ్బులు ఇచ్చేవాళ్లు చాలామంది ఉన్నారని.. ఆయన చనిపోవడానికి ఆర్ధిక ఇబ్బందులు కారణం అనేది నిజం కాదని అంటున్నారు అతని స్నేహితులు, తోటి డాన్సర్లు.
ఢీ టైటిల్ కొట్టలేదనే బాధ: స్నేహితుడి మాటల్లో..
ఢీ టైటిల్ కొట్టలేదనే బాధ అతనిలో ఉంది. లాస్ట్ సీజన్ ఢీ టైటిల్ మిస్ అయ్యింది.. ఈ సీజన్ ఎలిమినేట్ అయిపోయి ఉన్నాడు. దాని కోసమే ఆత్మహత్య చేసుకుని ఉంటాడు కానీ.. డబ్బు గురించి అయితే కాదని ఎందుకంటే.. ఆయన అడిగితే ఇచ్చే వాళ్లు చాలామంది ఉన్నారు. డబ్బులు విషయంలో ఆయన్ని ఒత్తిడి పెట్టింది ఏదీ లేదు. ఏ ఆర్గనైజర్‌ని డబ్బులు అడిగినా ఇస్తారు. డబ్బు ఆత్మహత్య చేసుకోవడం అనేది నిజం కాదు.. అది జరగని పని’ అంటూ చైతన్య మాస్టర్ స్నేహితుడు చెప్పుకొచ్చారు.