
Mumbai, August 8: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ (Aamir Khan) గురించి .. బాలీవుడ్ ప్రేక్షకులకే కాదు యావత్తు భారతావనికి తెలుసు. అమీర్ నటించిన దంగల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ చిత్రాల్లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇంతటి పేరు, ప్రఖ్యాతలు కలిగిన అమీర్ ఖాన్ ఎవరో తనకు తెలీదంటున్నాడు బాలీవుడ్ నటుడు అన్ను కపూర్ (Annu Kapoor). అతడు నటించిన క్రాష్ కోర్స్ వెబ్ సిరీస్ శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది.
ఈ సందర్భంగా చిత్రప్రమోషన్స్ లో పాల్గొన్న అతడిని అమీర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha) గురించి మీడియా ప్రశ్నించింది. దీనిపై అతని సమాధానం విని అక్కడి వారందరూ షాక్ అయ్యారు. అమీర్ పేరు చెప్పగానే.. కళ్లు చిట్లించుకున్న అన్ను.. అసలు అమీర్ ఖాన్ ఎవరని తిరిగి ప్రశ్నించాడు. అతడెవరో తెలియనప్పుడు, అతడి సినిమాలు తనకెలా తెలుస్తాయన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బీటౌన్‌లో వైరల్‌గా మారాయి.