Health Minister Harsh Vardhan releases the 14th edition of NHP (Photo-Twitter)

New Delhi, November 1: దేశ వ్యాప్తంగా ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గుతోన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ హెల్త్‌ ప్రొఫైల్‌ నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.దేశంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రోగుల్లో ఆంధ్రప్రదేశ్‌ సెకండ్ ప్లేస్ లో తెలంగాణ ఫిఫ్త్ ప్లేస్ లో నిలిచాయి. 2018 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 12.73 లక్షల మంది ఈ మహమ్మారితో బాధపడుతుండగా అందులో 1.82 లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌లో, 78వేల మంది తెలంగాణలో ఉన్నారని జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక-2019 వెల్లడించింది.

మొదటి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. ఈ రాష్ట్రంలో రెండు లక్షల నలభై వేల మందికి పైగా హెచ్ఐవి పేషంట్లు ఉన్నారు. ఇక మూడవ స్థానంలో కర్ణాటక నిలిచింది. ఈ రాష్ట్రంలో లక్షా 62 వేల మంది హెచ్ఐవి పేషంట్లు ఉన్నారు. సౌత్ ఇండియాలో మరో రాష్ట్రం తమిళనాడు విషయానికి వస్తే నాలుగవ స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో లక్షా 16 వేల మంది ఉన్నారు.

నివేదిక విడుదల 

దేశంలో సగటు వ్యక్తి ఆయు ప్రమాణం 49.7( 1970-75) నుంచి 68.7(2012-16)కి పెరిగినట్టు జాతీయ హెల్త్ ప్రొఫైల్ వెల్లడించింది. అదే సమయంలో పురుషుల కంటే స్త్రీల ఆయు ప్రమాణం మెరుగైనట్టు తెలిపింది. పురుషుల సగటు ఆయు ప్రమాణం 67.4గా ఉంటే, స్త్రీల సగటు ఆయు ప్రమాణం 67.4గా ఉంది. ఇక దేశంలో అత్యంత ఎక్కువ జన సాంద్రత నగరంగా ఢిల్లీ ఉన్నట్టు వెల్లడైంది. ఢిల్లీలో చదరపు కిలోమీటరకు 11,320 మంది నివసిస్తున్నట్టు తెలిపింది. అతి తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్‌ను పేర్కొంది.అక్కడ చదరపు కిలోమీటరకు కేవలం 17మంది మాత్రమే ఉన్నట్టు పేర్కొంది.

జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక-2019ను విడుదల చేసిన కేంద్ర మంత్రి హర్షవర్థన్ 

ఒకప్పుడు అతి భయంకరమైన వ్యాధిగా పరిగణించిన ఎయిడ్స్ వ్యాధి నిర్మాణం కోసం ఎయిడ్స్ నియంత్రణ మండలి నడుంబిగించింది. ఇప్పటివరకు ఎయిడ్స్ బారిన పడిన వారికి ఉపశమనానికి మందిని మినహాయించి, వ్యాధి పూర్తి నివారణకు మందులు కనిపెట్టలేదు. నేటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే ఈ వ్యాధి బారిన పడినవారు ఎక్కువ రోజులు బతికే అవకాశాలున్నాయి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పోషకాహరం, మందులు క్రమం తప్పకుండా తీసుకొంటే ఇతరుల మాదరిగానే జీవనం సాగించే అవకాశం ఉంది.