Representative image

Chennai, June 30; ప్రభుత్వాలు నిర్భయ (Nirbhaya) లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. స్త్రీకి రక్షణ లభించడం లేదు. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో అత్యాచార ఘటనలు (rapes)జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్దలు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆడపిల్లల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి. తాజాగా చెన్నైలో దారుణం జరిగింది. నగర శివార్లలో ఓ యువతి(20) గ్యాంగ్ రేప్‌కు (Gang rape) గురైంది. యువతిని బెదిరించి, మద్యం తాగించి రేప్ చేశారు కీచకులు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు పరారయ్యారు. నిందితుల్లో ఒకడు న్యాయవాది(Lawyer), మరొకడు బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

Karnataka Shocker: వీడు తండ్రేనా.. భార్య ప్రియుడితో వెళ్లిందని కూతుళ్లను చంపేసిన కసాయి, మృతదేహాలను ఆటోలో సీటు కింద పెట్టి బాడుగకు తిప్పాడు, కర్ణాటకలో దారుణ ఘటన 

చెంగల్‌పట్టుకి (Chenga pattu) చెందిన యువతి ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. స్థానికంగా ఉండే శరవణన్‌ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఎప్పటిలానే విధులు ముగించుకొని యువతి ఇంటికి వెళ్తుండగా దారిలో ఆమెకు కారులో వెళ్తున్న శరవణన్ (Saravan) కనిపించాడు. తన కారులో ఇంటి దగ్గర దిగబెడతానని శరవణన్ చెప్పాడు. ఫ్రెండ్ కావడంతో ఆమె అతడిని నమ్మి కారు ఎక్కింది. యువతిని తన కారులో తీసుకెళ్లిన శరవణన్.. కారులో బలవంతంగా ఆమెతో మద్యం తాగించాడు. కారులో ఉన్న తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం (Rape)చేశాడు. ఆ తర్వాత యువతిని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు.

Sathya Sai Road Accident: ఉడుత వల్లే ఘోర ప్రమాదం, ప్రమాద ఘటనపై శాఖ పరమైన విచారణకు ఆదేశించనట్టు తెలిపిన ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ, మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు సహాయం 

తీవ్ర గాయాలతో పడి ఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. శరవణన్‌ని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితుల్లో ఒకడిని సరతి(21) గా గుర్తించాడు. అతడు బీకామ్ ఫైనలియర్ స్టూడెంట్. మరొకడు సూర్యప్రకాశ్(22). అతడు న్యాయవాది.