Chennai, March 25: తమిళహీరో శింబు (Shimbu) మరో వివాదంలో చిక్కకున్నారు. ఆయన తండ్రి టి. రాజేందర్ ప్రయాణిస్తున్నకారు ఢీకొని ఒక వికలాంగుడు (Differently able) మృతి చెందాడు. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి కారణమైన కారు శింబు పేరుమీద ఉండటంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శింబు తండ్రి ప్రముఖ నటుడు, దర్శకుడు టి. రాజేందర్ (Rajender) గత శుక్రవారం రాత్రి డ్రైవర్‌తో పాటు కారులో వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న మరో కారు వెలుతురులో డ్రైవర్ గమనించక.. రోడ్డు పై పాకుతూ వెళ్తున్న వికలాంగుడిపై కారుని ఎక్కించాడు. దాంతో ఆ వికలాంకుడు తీవ్ర గాయాల పాలైయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Cctv footage of a differently abled man being run over by a car that belonged to actor Simbu’s father and director T Rajendran at T Nagar 😡😡😡 pic.twitter.com/61p75vU6EN
— Maan kumar Maan (@MaankumarMaan2) March 23, 2022
ప్రమాద సమయంలో కారులోనే ఉన్న రాజేందర్ వెంటనే స్పందించి అంబులెన్స్ ను పిలిపించారు. బాధితుడ్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వారం రోజులుగా చికిత్స పొందుతున్న మునుస్వామి(70) గురువారం రాత్రి మృతి చెందాడు. దాంతో ప్రమాదానికి కారణమైన శింబు కారు (Shimbu Car) డ్రైవర్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
ప్రమాదానికి గురైన కారు శింబు పేరు మీద ఉండటంతో శింబుపై కేసు నమోదు చేశారు. గతేడాది మానాడుతో బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు. అదే స్పీడులో వరుస సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.