Image credit - Pixabay

 జూలై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధిక శ్రావణమాసం కొనసాగనుంది ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు.  అంతేకాదు ఎలాంటి శుభముహూర్తాలు పెళ్లిళ్లు కూడా లేవని పండితులు చెబుతున్నారు. ఆగస్టు 17 నుంచి నిజస్రావణ మాసం ప్రారంభం కాబోతోంది ఆ తరువాతే పెళ్లిళ్ల ముహూర్తాలు పండగలు ప్రారంభం అవుతాయని పండితులు చెబుతున్నారు.  అయితే అధిక శ్రావణ మాసంలో కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఆ రాశి ఏంటో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. 

మేష రాశి

అధిక శ్రావణ మాసంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ముఖ్యంగా దూర ప్రయాణాలకు వెళ్ళకపోవడమే మంచిది. . అలాగే ఎత్తైన ప్రదేశాలకు కూడా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి.  ఈ మాసంలో మీకు ఎలాంటి విపత్తు సంభవించకుండా ఉండాలంటే మీ ఇంట్లో తూర్పు దిక్కున  సుబ్రమణ్య స్వామి పటం  ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు రెండు దీపాలు వెలిగించి ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః అని 108 సార్లు చదవండి అప్పుడు ఎలాంటి గండం మీ జోలికి రాదు. 

 వృశ్చిక రాశి

 అధిక శ్రావణ మాసంలో వృశ్చిక రాశి వారు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కావున మీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించకపోవడమే మంచిది. . అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఈ మాసం తర్వాతే ప్రారంభిస్తే చాలా మంచిది అలాగే వ్యాపారంలో కూడా నమ్మిన వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది కావున లెక్కల విషయంలో వ్యాపారం విషయంలో మీ దగ్గర వారిని కూడా నమ్మకండి. వృశ్చిక రాశి వారు ఈ మాసంలో దుర్గాదేవిని స్తుతిస్తే మంచిది.  ప్రతిరోజు దుర్గాదేవి  చిత్రపటం ముందు  కర్పూర హారతి ఇచ్చి  పూజ చేస్తే చాలా మంచిది. 

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ దిక్కులో అద్దం పెడితే, అశుభం 

 కుంభరాశి

 ఈ రాశి వారు కూడా అధిక శ్రావణమాసంలో వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో అవకతవకలు జరిగే అవకాశం ఉంది కావున మీ డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.  నమ్మిన వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది.  కుంభ రాశి వారు ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది. . ఈ మాసంలో ఎత్తైన ప్రదేశాలకు వెళ్లకపోవడం చాలా మంచిది.  వేగంగా ప్రయాణించే వాహనాలకు  దూరంగా ఉంటే మంచిది. . ఈ మాసంలో ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి  11 ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది.