ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధురాలిపై మూత్రవిసర్జన కేసులో శంకర్ మిశ్రాపై నాలుగు నెలల పాటు ఎయిర్ ఇండియా నిషేధం విధించింది. నవంబర్ 26న న్యూయార్క్ – ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి 72 సంవత్సరాల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సదరు వృద్ధురాలే మూత్రం పోసుకుందని, ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని కోర్టుకు తెలిపారు. ఆమె కూర్చుతున్న సీటు వద్దకు వెళ్లరాదని, అక్కడికి వెళ్లినా సీటు వెనుక వైపు నుంచి మాత్రమే వెళ్లగలరని, నేను మద్యం మత్తులో ఆమె సీటు వద్దకు వెళ్లినా.. మూత్ర విసర్జన చేశానంటే వెనుక సీట్లో కూర్చున్న వారు ఫిర్యాదు చేయాలి కదా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు నిరాకరించింది. అదే సమయంలో శంకర్ మిశ్రాకు సైతం బెయిల్ నిరాకరించింది.
Here's Update
Air India Pee-Gate: Airline Bans Accused Shankar Mishra for Four Months For Urinating on Elderly Woman#AirIndiaPeeGate #AirIndiaUrinatingIncident #ShankarMisharhttps://t.co/MczcRSBSJg
— LatestLY (@latestly) January 19, 2023
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)