పెట్రోల్ ధర సెంచరీని దాటిపోయింది, అయితే ప్రభుత్వం పెట్రోల్ ధర ఎంత పెంచినా లైన్ లో నిలబడి మరీ పెట్రోల్ కొట్టిస్తాం. ధరలు సంగతి అలా పక్కన పెడితే, పెరుగుతున్న మోసాలతో కూడా మనకే నష్టం.
>> పెట్రోల్ వేసేటప్పుడు, పెట్రోల్ బంక్ వాళ్ళు చేసే మోసాలు గురించి తెలుసుకుని జాగ్రత తీసుకోకపోతే ఈ నష్టం చాలా భారీగా మనపై పడుతుంది. పెట్రోల్ గాని డీజిల్ గాని నింపేటప్పుడు రీడింగ్ సున్నా చూపిస్తారు. ఆతర్వాత మనల్ని మాటల్లో పెట్టి దృష్టి మరల్చి, రీడింగ్ మార్చడం, లేదా ఇంధనం తక్కువగా కొట్టడం చేస్తారు. దీని వలన మనం చెల్లించిన డబ్బుకు సరిపడినంత ఫ్యుయల్ రాదు. అందుకని ఆ పని పూర్తి అయ్యే వరకు ఎటూ చూడకుండా రీడింగ్ వైపే చూడాలి.
>> పెట్రోల్ బంకుల్లో ఫ్యుయల్ నింపే సమయంలో కొందరు వర్కర్లు పదే పదే ఫ్యుయల్ నాజిల్‌ను ప్రెస్ చేస్తూ ఉంటారు. మనం రీడింగ్ పై దృష్టి పెడతాం కాబట్టి ఇది పెద్దగా పట్టించుకోం. నాజిల్‌ను అలా ప్రెస్ చేయడం వలన ఫ్యుయల్ మనకు తక్కువగా వస్తుంది.
>> కారు ఇలాంటి వాహనాలకు పెట్రోల్ వేయించుకునేతప్పుడు, చాలా మంది కారు దిగరు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ పెట్రోల్ దొంగతనం జరుగుతుంది. కాబట్టి కార్ దిగి రీడింగ్ వైపు నాజిల్ పైపు చూసుకోవాలి.
>> అలాగే ఏ పెట్రోల్ బంకులోనైనా ఫ్యుయల్ నింపే పైపులు పెద్దగా ఉంటాయి. ఈ క్రమంలో ఫ్యుయల్ మెషిన్‌కు దగ్గరగా ఉంటే ఆ పైపులు వంగిపోతాయి. దీని వల్ల కొంత ఫ్యుయల్ ఆ పైపుల్లో ఆగిపోతుంది. దీంతో మనకు రావల్సిన ఫ్యుయల్ రాదు. వాహనాన్ని మెషీన్‌కు కొంత దూరంలో నిలపితే… పైపు సాగినట్టు అవుతుంది. అప్పుడు వాటిలో ఫ్యుయల్ ఆగేందుకు అవకాశం ఉండదు.
>> ఎప్పుడైనా మీకు మోసం జరిగిందని అనుమానం వస్తే… వెంటనే అదే పెట్రోల్ బంక్‌లో టెస్ట్ చేసుకోవచ్చు. అందుకోసం 5 లీటర్ల క్యాన్‌లు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఫ్యుయల్ నాణ్యంగా లేకపోయినా, నాసిరకంగా ఉన్నా అదే పెట్రోల్ బంక్‌లో ఫిల్టర్ పేపర్ టెస్ట్ ఉంటుంది. దాన్ని కూడా మీరు అడిగి చేయించుకోవచ్చు. ప్రతి పెట్రోల్ బంక్‌లోనూ ఈ రెండు టెస్ట్‌లను ఉచితంగా చేస్తారు. అలా టెస్ట్ లో పెట్రోల్ తక్కువ ఉన్నా, క్వాలిటీ భాలేదని తేలినా వెంటనే కంప్లైంట్ ఇవ్వవచ్చు.