ఈశాన్య భారతంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. అరుణాచల్ రాజధాని ఇటానగర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. దామిన్ సర్కిల్ వద్ద బోర్డర్ రోడ్డు పనిలో నిమగ్నమైన ఆ కార్మికులు రెండు వారాల క్రితం కనిపించకుండాపోవడంతో.. ఆచూకీ లేని కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖకు సమీపంలోనే ఈ కార్మికులు అదృశ్యమయ్యారు. అయితే కుమే నదిలో ఓ కార్మికుడి మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 19 మంది కార్మికులు అస్సాం నుంచి వలస వచ్చినట్లు కాంట్రాక్టర్ తెలిపారు. జూలై 13వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చారు.
Arunachal Pradesh: One Dead, 18 Labourers Missing Near Indo-China Border In Kurung Kumey District#ArunachalPradesh #KurungKumey #Indiachinaborder https://t.co/VcdhygMAAB
— LatestLY (@latestly) July 19, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)