Lucknow, Sep 30: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ కోర్టు ఇవాళ సంచలన తీర్పును (Babri Masjid Demolition Case Verdict) వెలువరించింది. బాబ్రీ మసీదు కూల్చివేత ముందుగా అనుకున్న పథకం ప్రకారం చేసింది కాదు అని కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులే అంటూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానంలోని (Special CBI Court in Lucknow) కోర్టు రూమ్ నంబరు 18లో సీబీఐ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ తుది తీర్పును చదివి వినిపించారు. 2000 పేజీలు ఉన్న తీర్పు కాపీనీ న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ చదివారు. సీబీఐ సమర్పించిన ఆడియో, వీడియా ఆధారాల మూలంగా నిందితులను దోషులగా తేల్చలేమని కోర్టు చెప్పింది. నిందితులపై ఇచ్చిన ఆధారాలు బలంగా లేవని కోర్టు అభిప్రాయపడింది.
ఇవాళ లక్నో కోర్టులో బాబ్రీ మసీదు కూల్చివేత (Babri Masjid Demolition Case) విచారణ జరిగింది. 32 మంది నిందితుల్లో 26 మంది కోర్టుకు హాజరయ్యారు. ఆరుగురు హాజరుకాలేదు. హాజరుకాని వారిలో అద్వానీ, జోషీ, ఉమాభారతిలు ఉన్నారు. 1992, డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ లక్నో సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. అయితే బాబ్రీని కూల్చినవాళ్లు సంఘవ్యతిరేకులు అని ఇవాళ కోర్టు తన తీర్పులో పేర్కొన్నది.
అయోధ్యలో రామమందిర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్, మరో చోట కొలువుతీరనున్న బాబ్రీ మసీద్
Update by ANI
All accused in Babri Masjid demolition case acquitted by Special CBI Court in Lucknow, Uttar Pradesh. pic.twitter.com/9jbFZAVstH
— ANI (@ANI) September 30, 2020
ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వినయ్ కతియార్, సాక్షిమహారాజ్, ధరమ్‌దాస్, రామ్ విలాస్ వేదాంతి, లల్లూ సింగ్, పవన్ పాండ్యా తదితరులు కోర్టుకు చేరుకున్నారు. ఇక మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, సతీశ్ ప్రధాన్, గోపాల్ దాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరయ్యారు. మిగతా ముద్దాయిలంతా లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానానికి చేరుకున్నారు. ఉమా భారతి కరోనా సోకగా, వయో భారం, అనారోగ్యం కారణంగా ఎల్‌కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి సైతం న్యాయస్థానం ఎదుట స్వయంగా హాజరుకాలేకపోయారు.
అయోధ్య కేసుపై చారిత్రాత్మక తీర్పు, అయోధ్య ట్రస్టుకు వివాదాస్పద భూమిని కేటాయించాలి
దేశ వ్యాప్తంగా ప్రకంననలు రేపిన 1992 నాటి బాబ్రీ ఘటన తీర్పు నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తమైంది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. ఇదిలా ఉంటే 1992 డిసెంబర్ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేసిన విషయం విదితమే. ఈ కేసును విచారించిన సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగుతుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించింది. తీర్పువెలువడిన తర్వాత హైదరాబాద్ పాతబస్తీ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్ట్‌లో అదనపు భద్రత ఏర్పాటు చేశారు. తీర్పు నేపథ్యంలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.