ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా లక్షద్వీప్ ను పర్యాటకధామంగా మారుద్దామని ఆయన సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు.దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మగా ఒక మంత్రి వ్యాఖ్యానించగా, మరో ఇద్దరు భారత్ ను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో ఆ ముగ్గురు మంత్రులను అక్కడి ప్రభుత్వం పదవుల నుంచి (Maldives Government Suspends Ministers) తప్పించింది.
తాజాగా దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్(EaseMyTrip) ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్‌లో పోస్టు పెట్టారు.దానికి చలో లక్షద్వీప్(Chalo Lakshadweep) హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది. నిషాంత్ పిట్టి, రికాంత్ పిట్టి, ప్రశాంత్ పిట్టి దీనిని 2008లో స్థాపించారు. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై దుమారం, ముగ్గురుని మంత్రి పదవుల నుండి సస్పెండ్ చేసిన అక్కడి ప్రభుత్వం
Here's Tweet
In solidarity with our nation, @EaseMyTrip has suspended all Maldives flight bookings ✈️ #TravelUpdate #SupportingNation #LakshadweepTourism #ExploreIndianlslands #Lakshadweep#ExploreIndianIslands @kishanreddybjp @JM_Scindia @PMOIndia @tourismgoi @narendramodi @incredibleindia https://t.co/wIyWGzyAZY
— Nishant Pitti (@nishantpitti) January 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)