జీవితంలో డబ్బులు సంపాదించేందుకు చాలా కష్టపడుతుంటారు. ఎంత సంపాదించినా చాలామందికి అప్పులే దర్శనమిస్తుంటాయి. అయితే ఒక రూపాయి నాణెంతో జీవితమే మారిపోతుందంటున్నారు జ్యోతిష్య పండితులు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం డబ్బు సమస్య, ఆర్ధికపరమైన ఇబ్బందులు వెంటాడినప్పుడు ఇంట్లో వాస్తుదోషం, గ్రహదోషం కారణం కావచ్చు. ఈ దోషాల్ని దూరం చేసేందుకు కొన్ని సులభమైన పద్ధతులు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగానే రూపాయి నాణెంతో జీవితంలో ఆర్ధిక ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చంటున్నారు వాస్తు పండితులు.
మీకు సక్సెస్ రావాలంటే మీ పర్సులో లేదా జేబులో రూపాయి నాణెం, నెమలి ఈక ఉంచాలంటున్నారు పండితులు. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు దూరమౌతాయి. కష్టపడినదానికి ఫలితముంటుంది. జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో డబ్బుల సమస్య వల్ల కుటుంబంలో సమస్యలు ఉత్పన్నమైనా..లేదా నష్టాల్లో కూరుకుపోతున్నా బియ్యం, రూపాయి నాణెంతో సమస్యలు దూరం చేసుకోవచ్చు. గుప్పెడు బియ్యం, రూపాయి నాణెంతో గుడికి వెళ్లి ప్రార్ధించాలి.
ఓ మూలన ఆ బియ్యం, నాణెం ఉంచాలి. పూజల తరువాత ఆ బియ్యం, రూపాయి నాణెం దానం చేయాలి. ఎవరికైనా డబ్బుల్లేక ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటే..ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా..నిర్ణీత పద్ధతిలో సాయంత్రం వేళ ఇంటి ముఖద్వారం పై చతుర్ముఖ దీపాన్ని నెయ్యితో వెలిగించాలి. ఇది మీకు మంచి ఫలితాలనిస్తుంది. ఈ దీపంలో రూపాయి నాణెం వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ శక్తులు దూరమౌతాయి. ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసముంటుందని నమ్మకం.