Supreme Court of India (Photo Credit: ANI)

Courts cannot direct states to implement particular schemes: రాష్ట్ర ప్రభుత్వాల విధాన పరమైన అంశాలను పరిశీలించడంలో న్యాయస్థానాల పరిధి పరిమితంగా ఉంటుందని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. పథకాలు అమలు చేయాలని కోర్టులు ఆదేశించలేవని అత్యున్నత ధర్మాసనం తెలిపింది.చిన్నారులు ఆకలి, పోషకాహార లోపాన్ని(malnutrition) ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్‌(community kitchens)ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్న సందర్భంలో కోర్టు ఈ తీర్పునిచ్చింది.

IPC సెక్షన్ 417 ప్రకారం వివాహం రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, దాన్ని మోసం చేసిన నేరంగా పరిగణించలేమంటూ వధువు తండ్రి వేసిన పిటిషన్‌ కొట్టేసిన అత్యున్నత ధర్మాసనం

ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్‌ల స్కీమ్‌ రూపొందించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సామాజిక కార్యకర్తలు అనున్ ధావన్, ఇషాన్ సింగ్, కునాజన్ సింగ్ ప్రజా పయోజన వ్యాజ్యం(పిల్‌)‌ దాఖలు చేశారు. ఆకలి, పోషకాహారలోపం కారణంగా రోజూ వందల సంఖ్యలో ఐదేళ్లలోపు పిల్లలు మరణిస్తున్నారని, ఈ పరిస్థితి పౌరులు జీవించే హక్కును ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) చట్టం కింద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్న స్కీమ్‌లకు ప్రత్యామ్నాయంగా మరో స్కీమ్‌ తీసుకురావాలని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తెలిపింది.