Representational image (Photo Credit- ANI)

New Delhi, April 12: భారత్‌లో కరోనా వైరస్‌ (India Corona Virus) కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి. రోజూవారీ పాజిటివ్‌ కేసుల్లో (Positive Cases) భారీగా పెరుగుదల కనిపిస్తూ డేండజర్ బెల్స్ మోగిస్తున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 2,14,242 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 7,830 కేసులు బయటపడ్డాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,47,76,002కి చేరింది.మరోవైపు యాక్టివ్‌ కేసుల (Active Cases) సంఖ్య 40వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 40,215 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,42,04,771 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,016కి పెరిగింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 0.09 శాతం యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

యాంటీబయాటిక్ వినియోగంపై షాకింగ్ రిపోర్ట్, పెనుముప్పును కలిగించే రెసిస్టెంట్ బ్యాక్టీరియాతో అది సంబంధం కలిగి ఉందని పరిశోధనలో వెల్లడి

రోజూవారీ పాజిటివిటీ రేటు 3.65 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 3.83 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక రికవరీ రేటు 98.72 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,24,326) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.