COVID 2019 Outbreak| PTI Photo

Bengaluru, April 27: దేశంలో మళ్లీ కరోనావైరస్ కేసులు పెరుగుతున్న వేళ కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కరోనా ఫోర్త్ వేవ్ (Covid-19 Fourth Wave) జూన్ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, అక్టోబరు వరకు దాని ప్రభావం (Covid 4th wave may peak after June) ఉంటుందని కాన్పూరు ఐఐటీ నిపుణులు అంచనా వేశారని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్లు వేయించుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. బెంగళూరులో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయన (Karnataka health minister K Sudhakar) ఈ వ్యాఖ్యలు చేశారు.

కాన్పూరు ఐఐటీ పరిశోధకులు ఇచ్చిన నివేదికలోని విషయాలను మంత్రి వెల్లడించారు. దీని ప్రకారం.. రాష్ట్రంలో జూన్ చివరలో కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమై ఆ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఈ ప్రభావం సెప్టెంబరు నుంచి అక్టోబరు వరకు కొనసాగే అవకాశం ఉంది. కరోనాపై కాన్పూరు ఐఐటీ శాస్త్రవేత్తలు వేసిన అంచనాలు నిజమయ్యాయని, కాబట్టి తాజా నివేదికలోని అంశాలు కూడా నిజమయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.వారు గతంలో మూడు మూడు దాడుల గురించి ఇచ్చిన నివేదిక శాస్త్రీయంగా ఉందని అన్నారు.

దేశంలో కొత్తగా 2927 మందికి కరోనా, త 24 గంటల్లో 2252 మంది కోలుకోగా, 32 మంది మృతి, రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతానికి పెరిగిందని తెలిపిన ఆరోగ్యశాఖ

కాబట్టి ప్రతి ఒక్కరూ మునుపటిలా జాగ్రత్తగా ఉండాలని, వ్యాక్సిన్లు వేయించుకోవాలని, మాస్క్ తప్పకుండా ధరించాలని, భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని మంత్రి సూచించారు. అలాగే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో కొవిడ్ నాలుగో దశ కేసులు స్వల్పంగా ఉన్నట్టు తెలిపారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 85 కరోనా పాజిటివ్‌ కేసులు, 70 డిశ్చార్జిలు నమోదయ్యాయి. 1,686 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా 7,171 మందికి కరోనా పరీక్షలు చేశారు. బెంగళూరులో 82 కేసులు, 66 డిశ్చార్జిలు నమోదయ్యాయి. మరోవైపు బెంగళూరు మాస్క్‌ ధరించాలని బీబీఎంపీ మార్షల్స్‌ మైకుల ద్వారా కోరడం మొదలైంది. పలు రద్దీ ప్రాంతాల్లో సంచరిస్తూ మాస్క్‌ ధరించండి అని మైకుల్లో ప్రచారం చేశారు.