Maharashtra crisis maharashtra-governor-recommends-presidents-rule-in-the-state (Photo-PIB)

New Delhi, March 30: ఉగాది పండగ ముందు ప్రభుత్వ ఉద్యోగులకు (Centrel Govt. Employees) కేంద్రం శుభవార్త చెప్పింది. కరవు భత్యం (DA) 3శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకిచ్చే డీఏ (DA), పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను (DR) 3శాతం పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం (Cabinet) అంగీకరించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 31 శాతంగా ఉండగా.. తాజా నిర్ణయంతో అది 34 శాతానికి చేరింది. ఈ పెంపు జనవరి 1, 2022 నుంచే వర్తిస్తుందని కేబినెట్‌ భేటీ అనంతరం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపారు. కేంద్రం నిర్ణయంతో 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,544.50కోట్ల మేర అదనపు భారం పడనుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచడం ఆరు నెలల్లో ఇది రెండోసారి. అంతకుముందు గతేడాది అక్టోబరులో దీపావళి కానుకగా డీఏను 3శాతం పెంచారు. జులై 2021 నుంచే ఆ పెంపు వర్తిస్తుందని ప్రకటించారు. కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా ఆ మధ్య ఏడాదిన్నర పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని నిలిపివేశారు. 2021 జులైలోనే దాన్ని పునరద్ధరిండమే గాక, ఒకేసారి 11శాతం పెంచారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ఉద్యోగులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.