EC releases final list of voters in Andhra Pradesh | Photo -PTI

New Delhi, January 22: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో జనవరి 31 వరకు రోడ్‌షోలు(Road shows), ర్యాలీలపై(Rallies) నిషేధం కొనసాగుతుందని ఎలక్షన్‌ కమీషన్‌ (Election Commission) పేర్కొంది. ఈ మేరకు పంజాబ్ (Punjab), ఉత్తరప్రదేశ్(Utarapradesh), గోవా (Goa), ఉత్తరాఖండ్ (Uttarakhand), మణిపూర్‌ (Manipur)లలో జనవరి 31 వరకు రోడ్‌షో(Road shows)లు, ప్రచార ర్యాలీలు నిషేధిస్తున్నట్లు ఈసీ(EC) తెలిపింది. అంతేకాదు దేశంలోని కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా శనివారం రోడ్‌షోలు, ర్యాలీల పై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు ఎన్నికల సంఘం కేంద్ర ఆరోగ్య శాఖ (Central Health ministry) కార్యదర్శి, ఐదు రాష్ట్రాల ముఖ్య ఆరోగ్య కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల సంఘం ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలను మొదట జనవరి 15 వరకు నిషేధించిన తదుపరి మళ్లీ జనవరి 22 వరకు ఆ నిషేధాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే.

Utpal Parrikar Quits BJP: గోవాలో బీజేపీ భారీ షాక్, పార్టీని వీడిన మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటన

అంతేకాదు రాజకీయ పార్టీల భౌతిక బహిరంగ సభలకు లేదా పోటీ చేసే అభ్యర్థులకు జనవరి 28 నుంచి ఫేజ్ 1, ఫేజ్ 2 కోసం ఫిబ్రవరి 1 నుంచి సడలింపులను అనుమతించింది. పైగా కోవిడ్‌-19 ఆంక్షల మేరకు నిర్దేశించిన బహిరంగ ప్రదేశాలలో ప్రచారం కోసం అనుమతించిన భద్రతా సిబ్బంది, వీడియోవ్యాన్‌లను మినహాయించి, ఇంటింటికీ ప్రచారం కోసం ఐదుగురు వ్యక్తుల పరిమితిని 10కి పెంచినట్లు తెలిపింది.