సుప్రీంకోర్టు తొలి మ‌హిళా న్యాయ‌మూర్తిగా నియ‌మితులైన జ‌స్టిస్ ఎం ఫాతిమా బీవి (Fathima Beevi) 96 ఏండ్ల వ‌య‌సులో అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు అత్యున్నత‌ న్యాయ‌వ్య‌వ‌స్ధ‌లో ఉన్న‌త స్ధానానికి ఎదిగిన తొలి ముస్లిం మ‌హిళ‌గా కూడా ఆమె అరుదైన ఘ‌న‌త సాధించారు.1989లో సుప్రీంకోర్టు తొలి మ‌హిళా న్యాయ‌మూర్తిగా ఎదిగి చ‌రిత్ర సృష్టించారు. 1992, ఏప్రిల్ 29న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందే వ‌ర‌కూ ఈ పదవిలో కొన‌సాగారు.

రిటైరైన త‌ర్వాత ఆమె జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ స‌భ్యురాలిగా ప‌నిచేశారు. ఆపై త‌మిళనాడు గ‌వ‌ర్న‌ర్‌గానూ ఫాతిమా బీవి సేవ‌లందించారు.1950లో బార్ కౌన్సిల్ ప‌రీక్ష‌లో ఆమె అగ్ర‌స్దానంలో నిలిచి బార్ కౌన్సిల్ గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్న తొలి మ‌హిళ‌గా నిలిచారు. 1927 ఏప్రిల్ 30న కేర‌ళ‌లో జ‌న్మించిన ఫాతిమా బీవీని న్యాయ విద్య అభ్య‌సించాల‌ని తండ్రి ప్రోత్స‌హించారు.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)