
హైదరాబాద్‌లోని కాప్రా వద్ద శనివారం ఓ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి పడి ఓ బాలిక మృతి చెందింది. ఆమె వయసు 14 సంవత్సరాలు. కుషాయిగూడ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉపేందర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం..అపార్టుమెంట్లో 5 అంతస్తులో వేసిన ముగ్గులతో పోతిశెట్టి కిన్నెర అనే బాలిక మొబైల్ ఫోన్‌లో సెల్ఫీ దిగుతుండగా, ప్రమాద వశాత్తూ జారిపడింది. తీవ్రంగా గాయపడిన బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అనంతరం ఆసుపత్రిలో వైద్యులు ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు.