Puducherry, Febuary 29: గోదావరి, కావేరి నదుల అనుసంధానానికి (Godavari-Cauvery Link Project) రూ.60వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గోదావరి నదిలో నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న 1200 టీఎంసీల నీటిని ఈ రెండు నదుల అనుసంధానంతో (River-Linking project) సాగు అవసరాలకు మళ్లించుకోవచ్చని మంత్రి తెలిపారు. పుదుచ్చేరిలోని ఎన్ఐటీ 6వ స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి గడ్కరీ విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి
గోదావరి, కావేరి నదుల అనుసంధానానికి అవరసరమయ్యే మొత్తాన్ని ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సమకూర్చుకోవాలని యోచిస్తున్నట్లు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గడ్కరీ (Union Minister Nitin Gadkari) తెలిపారు. ఈ మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు లేదా ఆసియా అభివృద్ధి నుంచి రుణంగా పొందేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తెలిపారు.
బ్యాంకు గోదావరి, కృష్ణా, పెన్నార్, కావేరి నదులను అనుసంధానం చేసే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. అంతకు ముందు రోజు మంత్రి గడ్కరీ పుదుచ్చేరి సీఎం వి నారాయణస్వామితో కలిసి జాతీయ రహదారుల ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. అంతకు ముందు రాజ్ నివాస్ కు వెళ్లి పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీని కలిసి మాట్లాడారు. అనంతరం పుదుచ్చేరిలోని శ్రీ అరబిందో ఆశ్రమాన్ని మంత్రి గడ్కరీ సందర్శించారు.
Polavaram Project Mission @2021
ఇదిలా ఉంటే గోదావరి – కృష్ణా – కావేరి నదుల అనుసంధానంపై తాము సూచించిన ప్రతి పాదనలను పరిశీలించి త్వరగా తమకు నివేదిక ఇవ్వాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. జానంపేట్ మీదుగా గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించి అటు నుంచి కావేరికి తీసుకెళ్లే ప్రతిపాదనపై అభ్యంతరాలు, పరిశీలనను త్వరగా తెలపాలని సూచించింది.
ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ ఖటారియా అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) 17వ ప్రత్యేక కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ ఉపేంద్రప్రతాప్ సింగ్, ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భూపాల్‌సింగ్, సీడబ్ల్యూసీ అధికారులు, ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి
గోదావరి – కృష్ణా – కావేరి (గ్రాండ్ ఆనికట్) అనుసంధానం ప్రాజెక్టును తొలి ప్రాధాన్యతగా చేపట్టాలని తమిళనాడు అధికారులు కేంద్రాన్ని కోరారు. గోదావరితో అనుసంధానం చేస్తే తప్ప తమ రాష్ట్ర నీటి కష్టాలు తీరవని స్పష్టం చేశారు. గోదావరి నీటిని జానంపేట మీదుగా కృష్ణాకు, అటుగా తమిళనాడులోని గ్రాండ్ ఆనికట్‌కు 247 టీఎంసీల నీటిని తరలించేందుకు ఎన్‌డబ్ల్యూడీఏ ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, దీన్ని త్వరగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరం నిధులను విడుదల చేసిన కేంద్రం, రూ. 1850 కోట్లు నాబార్డు నుంచి ఏపీ ఖాతాలోకి
గోదావరి, కృష్ణాలో కేటాయింపుల మేరకు నీటిని తాము వాడుకున్నాక మిగిలితేనే తమిళనాడుకు తరలించాలని ఏపీ వాదించింది. ఈ మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ఓ ప్రపోజల్ అందజేసింది. గోదావరిలో తమ రాష్ట్రానికి 526 టీఎంసీల నీళ్లు అలొకేషన్ ఉందని, అయితే పోలవరం నుంచి ఎక్కువ నీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలని కోరింది. గోదావరి, కృష్ణాలో కలిపి తమ కేటాయింపుల మేరకు నీటిని వాడుకునేలా గోదావరి, కృష్ణా లింక్ ప్రాజెక్టును చేపడతామని నివేదించింది. తమ అవసరాలు తీరాక పెన్నా బేసిన్ మీదుగా గ్రాండ్ ఆనికట్ (కావేరి)కి తరలిస్తే తమకేం అభ్యంతరం లేదంది.
ఆడిట్ పూర్తయ్యాక నిధులు విడుదల చేస్తామన్న కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్
ఈ సమావేశంలో.. ఇంద్రావతి నీళ్లను పూర్తిగా తామే వాడుకుంటామని చత్తీస్‌గఢ్ ప్రస్తావించింది. ఇంద్రావతిలో మిగులు జలాలు ఉన్నాయంటూ దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టొద్దని చెప్పింది. గోదావరి, కావేరి లింక్‌కు తాము ఆమోదం తెలుపబోమని తేల్చిచెప్పింది.
పోలవరం ప్రాజెక్టుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
గోదావరిలో 530 టీఎంసీలు, మహానదిలో 360 టీఎంసీల మిగులు జలాలున్నట్టు ఎన్‌డబ్ల్యూడీఏ గుర్తించింది. 75 శాతం డిపెండబులిటీ ఆధారంగానే ఈ మేరకు నీళ్లున్నాయని, వాటిలోంచి 247 టీఎంసీలను గోదావరి, కృష్ణా, కావేరి లింక్‌లో భాగంగా వాడుకలోకి తెస్తామని ప్రతిపాదనల్లో పేర్కొంది. లింక్‌కు మహానది నీళ్లలో హక్కుదారైన ఒడిశా పెద్దగా అడ్డు చెప్పకపోయినా ఇంద్రావతిపై చత్తీస్ గఢ్ కొర్రీలతో ప్రాజెక్టుపై ఎలా ముందుకెళ్తుందని ప్రశ్న తలెత్తుతోంది.