Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy inspects Polavaram Project ongoing works in West Godavari District ( Photo Wikimedia Commons facebook)

Amaravathi, Febuary 28: ఏపీ (Andhra Pradesh) సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరానికి చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ముఖ్యమంత్రి (Chief Minister YS Jagan Mohan Reddy) హోదాలో ఆయన రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ను (Polavaram Project) ఏరియల్‌ సర్వే ద్వారా సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. Polavaram Project Mission @2021

వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి

కాగా సీఎం హోదాలో రెండోసారి వైయస్ జగన్ పోలవరానికి (Polavaram) వెళ్లారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద ఫోటో ఎగ్జిబిషన్‌ను జగన్ తిలకించారు. పోలవరం పనుల పురోగతిపై ఆయన సమీక్ష చేయనున్నారు. పోలవరం పురోగతి పనులను పరిశీలించి అధికారులతో రివ్యూ మీటింగ్‌ నిర్వహించనున్నారు.

పోలవరం నిధులను విడుదల చేసిన కేంద్రం, రూ. 1850 కోట్లు నాబార్డు నుంచి ఏపీ ఖాతాలోకి

అంతకు ముందు పోలవరం ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు హెలిప్యాడ్‌ వద్ద మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పేర్ని నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కొట్టు సత్యనారాయణ, తల్లారి వెంకట్రావు, దేవులపల్లి ధనలక్ష్మి, జీఎస్ నాయుడు, ముదునూరి ప్రసాదరాజు, పుప్పాల వాసుబాబు, ఎంపీలు మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్‌, కలెక్టర్‌ ముత్యాల రాజు స్వాగతం పలికారు.

ఆడిట్ పూర్తయ్యాక నిధులు విడుదల చేస్తామన్న కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయడానికి ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక(యాక‌్షన్‌ ప్లాన్‌) అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించి, గడువులోగా పూర్తి చేయాడానికి తీసుకోవాల్సిన చర్యలపై జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులకు మార్గనిర్దేశం చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాజెక్టుల బాట పట్టిన సంగతి విదితమే

పోలవరం ప్రాజెక్టుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఆరు దశాబ్దాల క్రితం ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వచ్చే ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసి ఖరీఫ్‌ పంటకు నీళ్లివ్వడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైఎస్‌ హయాంలో ఈ ప్రాజెక్టుకు కాల్వలు తవ్వారు. టీడీపీ హయాంలో కొన్ని పనులు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లింది.

పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 628 కోట్లు ఆదా

628 కోట్ల రూపాయలమేర ఆదా చేస్తూ నిర్మాణ బాధ్యతను మేఘా సంస్థకు అప్పగించింది. దీంతో మేఘా ఆఘమేఘాల మీద నిర్మాణ పనులు చేపడుతోంది. రికార్డు సమయంలో ప్రాజెక్టును నిర్మించి ఇచ్చేందుకు కృషి చేస్తోంది..