Gold | Representational Image | (Photo Credits: IANS)

ఓ వైపు ఆర్ధిక మాద్యం..మరోవైపు అగ్రరాజ్యంలో బ్యాంకుల దివాళా వార్తలు.. వెరసీ అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర సోమవారం రోజు 1శాతం పెరిగింది. గత ఏడాది మార్చి తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఇప్పటికే సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌లు దివాళా తీయగా.. అదే దారిలో మరికొన్ని బ్యాంకులు పయనిస్తున్నాయంటూ ఆర్ధిక వేత్తల అంచనాలు బంగారం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.

పుల్లుగా తాగి తన పెళ్లి సంగతి మరచిపోయి నిద్రపోయిన పెళ్లి కొడుకు, తెల్లారి పెళ్లి క్యాన్సిల్ అంటూ షాకిచ్చిన యువతి, బీహార్‌లో వైరల్ ఘటన

దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒకే రోజు రూ.1400 పెరిగి రూ.61,100కు చేరింది. వెండి ధర సైతం రూ.1860 పెరిగి రూ.69,340కి చేరింది. ఇటీవల బ్యాంకింగ్‌ రంగంలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు బంగారం ధరకు రెక్కలు రావడానికి కారణమయ్యాయి. అనూహ్యంగా పది రోజుల వ్యవధిలోనే పసిడి ధర రూ.56వేల స్థాయి నుంచి రూ.60వేల స్థాయికి చేరింది.

అప్పుల బాధ భరించలేకపోతున్నారా, అయితే మార్చి 24న మత్స్య జయంతి పండగ రోజు, ఈ పూజ చేస్తే లక్ష్మీ దేవి వరం పొందడం ఖాయం...

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ 1 శాతం పెరిగి ఔన్స్‌ బంగారం 2,007.30 డాలర‍్లకు చేరింది. అంతకుముందు సెషన్‌లో 1శాతానికి పడిపోయింది. యూఎస్‌ మార్కెట్‌లో 2శాతం పెరిగి 2,012.50డాలర్లకు చేరింది. బ్యాంకులు షట్‌డౌన్‌ అవుతాయోమోనన్న భయాలతో మదుపర‍్లు..బ్యాంకుల్లో దాచిన డిపాజిట్లను తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు.లాభాదాయకమైన బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బంగారం ధరలు రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్నాయి.