Gold Rates: బంగారు తులం 52 వేల పైనే, కానీ మహిళలకు గుడ్ న్యూస్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం చల్లబడటంతో త్వరలోనే పసిడి ధరలు దిగివచ్చే చాన్స్
Representational Image (Photo Credits: Pixabay)

తాజాగా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పదిగ్రాములకు రెండు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,800 రూపాయలుగా ఉంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం శాంతి చర్చల దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో త్వరలోనే బంగారం 50 వేల దిగువకు వస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు

జమ్ముకశ్మీర్‌లో కూలిపోయిన ఆర్మీ చీతా హెలికాప్టర్‌, పైలట్‌, కో పైలట్‌ పారాచూట్‌ ద్వారా బయటపడినట్లు వార్తలు, వారిని గాలిస్తున్న ఆర్మీ రెస్క్యూ బృందాలు

బంగారం అంటేనే క్రేజ్. అదో మోజు. బంగారాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యంగా మహిళలు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తుంటారు. తమ వద్ద డబ్బులు రాగానే వెంటనే బంగారం దుకాణాలకు పరుగులు తీస్తారు. బంగారానికి భారత్ లో అంత డిమాండ్ ఉంది. ఇక రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం మొదలయిన వెంటనే బంగారం ధరలు కూడా పరుగులు ప్రారంభంచాయి. ఎక్కువ రోజులు పెరగడం, కొద్ది రోజులు స్థిరంగా ఉండటం చూశాం. బంగారానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ ను దాని ధరల తగ్గుదల, పెరుగుదల ఆధారపడి ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.