కేంద్ర ప్రభుత్వం 2022వ సంవత్సరానికి పద్మ అవార్డులు ప్రకటించింది. దివంగత బిపిన్ రావత్ కు పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందించింది. నలుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు, 17 మందికి పద్మ భూషణ్ పురస్కారాలు, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్లకు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించింది. అలాగే రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం)కు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. వీరితో పాటు కల్యాణ్ సింగ్ (మరణానంతరం)కు పద్మ విభూషణ్ అవార్డు అవార్డు ప్రకటించింది.
గరికపాటి నరసింహారావు (ఏపీ)కు పద్మశ్రీ, గోసవీడు షేక్ హసన్ (ఏపీ)కు పద్మశ్రీ, డా.సుంకర వెంకటఆదినారాయణ (ఏపీ)కు పద్మశ్రీ అవార్డు, దర్శనం మొగిలయ్య (తెలంగాణ)కు పద్మశ్రీ పురస్కారం, రామచంద్రయ్య (తెలంగాణ)కు పద్మశ్రీ, పద్మజా రెడ్డి (తెలంగాణ)కు పద్మశ్రీ పురస్కారం వరించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌తో పాటు కొవిషీల్డ్ టీకా తయారు చేసిన సీరమ్ సంస్థ వ్యవస్థాపకులు సైరస్ పూనావాల, టెక్ దిగ్గజ సంస్థలైన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను పద్మభూషణ్ వరించింది. కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు పరిశ్రమలు, వాణిజ్యం విభాగంలో పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేశారు.
ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌కు పద్మశ్రీ అవార్డు, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు పద్మశ్రీ, బుద్ధదేవ్ భట్టాచార్య (బంగాల్)కు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు.
Here's Total list
Govt announces Padma Awards 2022
CDS Gen Bipin Rawat to get Padma Vibhushan (posthumous), Congress leader Ghulam Nabi Azad to be conferred with Padma Bhushan pic.twitter.com/Qafo6yiDy5
— ANI (@ANI) January 25, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)