కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నేత భరత్ సోలంకీ గురువారం ఆత్మహత్యాయత్నం చేశారు. గాంధీధామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత మాల్తీబెన్ కిషోర్‌భాయ్ మహేశ్వరిపై భరత్ సోలంకీ 37,831 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ భరత్ భాయ్ సోలంకి కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసనకు దిగారు. తన నిరసనలు ఫలితం లేకపోవడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద కండువాతో మెడకు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఈవీఎంలకు సీల్ సరిగా లేదని, సంతకాలు లేవని ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌లో 125 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నేత భరత్ భాయ్ సోలంకీ గతంలో ప్రకటించారు.
Here's Video
कांग्रेस प्रत्याशी भरत सोलंकी ने की आत्महत्या की कोशिश
EVM में गड़बड़ी का लगाया आरोप #GujaratElectionResult #Congress #GandhiDham #BharatSolanki pic.twitter.com/MqjSkKF5Yp
— News24 (@news24tvchannel) December 8, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)